తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం క్షేత్ర స్థాయిలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కష్ట పడటం వంటివి ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ గా మారిన అంశాలు. రాజకీయ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో దూకుడుగా ముందుకు వెళ్ళడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మీద అలాగే కాంగ్రెస్ పార్టీ బలహీనతల మీద ఎక్కువగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాస్త గట్టిగా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయనతో పాటుగా ఎంపీ సోయం బాపూరావు కూడా పార్టీ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు వెనక్కు తగ్గడం కాస్త టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వస్తుందని అంటున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ లో కొంతమంది బీజేపీ  నాయకులు సైలెంట్ గా ఉండడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

బీజేపీ లో కీలక నేతగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ మధ్య కాలంలో పెద్దగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని గతంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సదరు ఎమ్మెల్యే ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పట్ల బీజేపీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. బిజెపి లో ఉన్న చాలా మంది నాయకులకు కూడా ఆయన అందుబాటులో ఉండటం లేదని బీజేపీ కార్యాలయానికి కూడా పెద్దగా రావడం లేదనే ప్రచారం కూడా కొంతమంది చేయడం మొదలుపెట్టారు. అయితే బీజేపీ లో కీలక నేతగా ఉండటంతో కాస్త సీఎం కేసీఆర్ కూడా సొంత జిల్లాలో ఆయన విషయంలో అప్రమత్తంగా ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp