ఏపీలో 13 జిల్లాలు ఉంటే...టీడీపీ దృష్టిలో 12 జిల్లాలే ఉన్నాయని చెప్పాలి..ఎందుకంటే కడప జిల్లాని టీడీపీ లెక్కలో వేసుకోకూడదనే చెప్పాలి. కడపని ఎందుకు లెక్కలో వేసుకోకూడదో అందరికీ తెలిసిందే. కడప అంటే టీడీపీకి ఏ మాత్రం కలిసి రాని జిల్లా అనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఇంతవరకు టీడీపీ మంచి విజయాలు ఏమి సాధించలేదు. ఏదో అప్పుడప్పుడు ఒక నియోజకవర్గం గెలుచుకుంది గానీ...జిల్లాలో ఎప్పుడు ఆధిక్యం తెచ్చుకోలేదు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్తితులు ఉన్నా సరే కడప ప్రజలు మాత్రం వైఎస్సార్ ఫ్యామిలీ వైపే ఉంటారు. ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే మద్ధతు ఇస్తారు..గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలకు కడప ప్రజలు అండగా ఉన్నారు.

భవిష్యత్‌లో కూడా వైసీపీకే అండగా ఉంటారు...ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏదో రకంగా జిల్లాలో ఒకటి, రెండు సీట్లు అయిన గెలుచుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. గత మూడు ఎన్నికలని చూసుకుంటే జిల్లాలో టీడీపీ పెద్దగా సత్తా చాటలేకపోయింది. 2009 ఎన్నికల్లో ఒక ప్రొద్దుటూరు సీటు గెలుచుకోగా, 2014 ఎన్నికల్లో రాజంపేట సీటు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో అయితే...10 సీట్లలోనూ ఓడిపోయింది. మరి 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మరే 10 సీట్లలో ఓడిపోకుండా...కనీసం ఒకటి రెండు సీట్లు అయిన గెలుచుకుంటే పరువు నిలబడుతుందని టీడీపీ చూస్తుంది.

ఈ క్రమంలోనే టీడీపీ మైదుకూరు, ప్రొద్దుటూరు సీట్లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాస్త ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైనట్లు కనిపిస్తోంది. అలా అని వైసీపీని పూర్తిగా డామినేట్ చేసేలా మాత్రం టీడీపీ రాలేదు. కానీ ఎలాగోలా నెక్స్ట్ ఎన్నికల్లోపు ఇంకా కష్టపడితే ఒక సీటు అయిన గెలుచుకోలేమా అని చూస్తున్నారు. అయితే మైదుకూరులో టీడీపీకి కాస్త ప్లస్ కనబడుతోంది. చూడాలి మరి కడపలో టీడీపీ ఏ మేర సత్తా చాటుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: