ఇలా క్రాస్ పాలిటిక్స్ పలు నియోజకవర్గాల్లో జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ క్రాస్ పాలిటిక్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా జరుగుతాయి. ఇక్కడ టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మంత్రి పేర్ని నానిల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు..మరొకరికి సపోర్ట్‌గా నిలుస్తూ ఉంటారు. ఇది ఎప్పటినుంచో జరుగుతూనే వస్తుంది.
అయితే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల గెలవడానికి ఈ క్రాస్ పాలిటిక్స్ ఉపయోగపడేలా ఉన్నాయని చెప్పొచ్చు. అది ఎలా అంటే...అసెంబ్లీ స్థానం పరిధిలో ఓటు వైసీపీకి వేసి...ఎంపీ ఓటు మాత్రం టీడీపీకి పడేలా చేయడం. ఇది కేవలం మచిలీపట్నం నియోజకవర్గంలోనే జరగదు....మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉండే గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పెడన లాంటి నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. 2009 ఎన్నికల్లో అదే జరిగింది...పార్లమెంట్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే...ఎంపీగా మాత్రం టీడీపీ నుంచి కొనకళ్ళ గెలిచారు.
అయితే 2019 ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది...కానీ జగన్ గాలి ఎక్కువగా ఉండటంతో కొనకళ్ళ గెలుపు సాధ్యం కాలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం కొనకళ్ళకు లక్ కలిసొచ్చేలా ఉంది. మెజారిటీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గౌడ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి...వీరు ఎమ్మెల్యే ఓటు ఏ పార్టీకి వేసినా..ఎంపీ ఓటు మాత్రం కొనకళ్ళకే వేసేస్తారు. అటు వైసీపీ నేతలు కూడా పరోక్షంగా గౌడ వర్గానికి అలాగే ఓటు వేయమని చెబుతారు...ఎమ్మెల్యే ఓటు తమకు వేసి...ఎంపీ ఓటు మీ నాయకుడుకు వేసుకోమని అంటారు. ఈ విధంగా మచిలీపట్నంలో క్రాస్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి