పెళ్లిళ్ల సీజన్ వచ్చింది అంటే చాలు ఇక వరుసగా పెళ్లిళ్లు ఏ రేంజిలో జరుగుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడికి వెళ్లినా ఏం చేసిన కూడా పెళ్లి సందడి  కనిపిస్తూ ఉంటుంది. ఇక బాజా భజంత్రీల శబ్దాలు శబ్దాలు మారుమోగి పోతూ ఉంటాయి.. అంతలా పెళ్లిళ్ల సీజన్  లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడానికి అందరూ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు సరైన సమయం సందర్భం చూసి ఇక అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే వారు.. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది సరైన ముహూర్తం ఉంటే చాలు ఇక ఎలాగోలా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు.. కట్నకానుకల విషయంలో కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం లేదు చాలామంది.


 ముఖ్యంగా ప్రస్తుతం డిసెంబర్ నెలలో అయితే ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అని తెలుస్తోంది.  ఎంతో మంది  యువకులు కనీసం కట్నకానుకలు ఎంత ఇస్తున్నారు అన్న విషయం గురించి కూడా ఆలోచించడం లేదట. త్వరగా పెళ్లయితే అంతే చాలు అని భావిస్తున్నారు. దీనికి కారణం  త్వరలో ముహూర్తాలు ముగిసిపోతు ఉండటమే. ప్రస్తుతం మార్గశిరమాసం కొనసాగుతోంది. ఇక మార్గశిర మాసంలో పెళ్లిళ్లు ముహూర్తాలు ఉన్నాయి.


 అయితే మార్గశిరమాసం దాటితే మాత్రం పుష్యంలో వివాహాలు చేసుకోవడం అస్సలు కుదరదు. ఈ క్రమంలోనే కేవలం ఈ నెల 29 వరకే పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభ ముహూర్తాలు ఉన్నాయ్ అంటూ అటు పండితులు కూడా చెబుతూ ఉండటం గమనార్హం. దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని భావించేవారు కట్నకానుకల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం లేదట.. పట్టింపులు, పెట్టు పోతుల గురించి అస్సలు పట్టించుకోకుండా పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారట. ఈ క్రమంలోనే రానున్న వారంలో లెక్కకుమించి వివాహాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది.  కల్యాణమండపాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో కళ్యాణ మండపం అందుబాటులో లేకపోతే గుళ్లల్లో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ నేపథ్యంలో మళ్లీ కఠిన ఆంక్షలు ఎక్కడ అమలులోకి వస్తాయో అని భయపడి పెళ్లి చేసుకుంటున్న వారు కూడా కొంత మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: