పొరుగున ఉన్న చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం రష్యా ఎన్నో వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ కు సంబంధించిన కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న రష్యా అక్కడ భారీగా సైనికులను మొహరించి యుద్ధానికి సిద్ధం అనే  సంకేతాలను ఇస్తుంది. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో చేరడానికి వీలు లేదని తమతో కలిసి ఉండాలి అంటూ పట్టుబడుతుంది. అయితే తాము స్వతంత్ర దేశంగా కొనసాగుతున్నామని.. మేము ఎవరితో కలిసి ఉండాలి అన్నది మేమే నిర్ణయించుకుంటాము అంటూ చిన్న దేశమైన ఉక్రెయిన్ సమాధానం ఇస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఉక్రెయిన్ కి అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉండడం గమనార్హం.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రోజురోజుకు యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో ఇరుదేశాల మధ్య ఆయుధ ప్రయోగం జరుగుతుందో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అది ఇప్పటికె అగ్రరాజ్యమైన అమెరికా ముందుకు వచ్చి రష్యాతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన  గురించి చర్చలు జరిపింది. అయితే సరిహద్దుల్లో  ఉద్రిక్తత పై మూడు సార్లు చర్చలు జరిపినప్పటికీ రష్యా తీరుతో చర్చలు మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇరు దేశాలు కూడా సరిహద్దుల్లో సైన్యం మొహరిస్తూ ఆయుధాలను కూడా మొహరిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం ఆయుధాలతో యుద్ధం జరిగక పోయినప్పటికీ అటు సైబర్ యుద్ధం మాత్రమే ఇరు దేశాల మధ్య జరుగుతుంది అనేది తెలుస్తుంది.



 రష్యా కు సంబంధించిన సైబర్ ఆర్మీ ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థపై సైబర్ ఎటాక్ చేస్తు డేటా మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రష్యా రక్షణ వ్యవస్థ పై సైబర్ ఎటాక్ చేస్తుందట. ఇలా ఇరు దేశాల మధ్య ఆయుధాలతో యుద్ధం జరిగకపోయినప్పటికీ సైబర్ యుద్ధం జరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇక రానున్న రోజుల్లో ఈ సైబర్ యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అని కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: