అయితే ఇది నిన్నటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం, కానీ నేటితో వారు అక్కడి నుండి తరలి వెళ్లిపోయినట్లు రష్యా చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అలా లేవని కొన్ని వార్తా ఛానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నల్ల సముద్రం ప్రాంతంలో రష్యా సైన్యం యుద్ద విన్యాసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ద విన్యాసాలలో రష్యా బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిస్సైల్స్ ను ఉపయోగిస్తోంది. దానితో ఆ ప్రాంతం అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ప్రభావం వలన ఉక్రెయిన్ దగ్గర దేశాలు అయిన నాటో, అమెరికా లాంటి దేశాలు అలెర్ట్ అవుతున్నాయి. ఇక మిగిలింది.. పూర్తిస్థాయిలో యుద్దమే.
అంతలా ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమ్మంత అణు ఆయుధాలతో నిండిపోయి ఉంది. దీనిని బట్టి చూస్తే రానున్న రెండు మూడు రోజుల్లో ఉక్రెయిన్ దేశంతో రష్యా తప్పక యుద్ధం చేస్తుందనే సూచన. అయితే యుద్ధం చేస్తే అమెరికా లాంటి దేశాలు ఏమి చేయాలి అనే విషయంపై చర్చలు సాగిస్తున్నాయి. నిజంగానే యుద్ధం జరుగుతుందా..? లేదా ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా ఏమైనా అద్బుతం చేసి యుద్దాన్ని ఆపుతుందా.. అన్నది చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి