ఎందుకంటే అంతలా నిమ్మలకు ప్రజా మద్ధతు ఉందని చెప్పొచ్చు..ఈయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు...ప్రజా సమస్యలని తెలుసుకుంటారు...సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైన వెళ్తారు...ఏదో ఎమ్మెల్యే అన్నట్లు హడావిడి చేయకుండా, ఒక సామాన్యుడు మాదిరిగా ప్రజల్లో కలిసిపోయి తిరుగుతారు. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే నిమ్మల 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే...2019 ఎన్నికల్లో వైసీపీ హవా ఉన్నా సరే..17 వేల ఓట్ల మెజారిటీతో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే రెండోసారి టీడీపీపై వ్యతిరేకత ఉన్నా సరే నిమ్మలకు అంత మెజారిటీ వచ్చిందంటే పాలకొల్లు ప్రజల మద్ధతు నిమ్మలకు ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు..ఇప్పటికీ ఆ ప్రజా బలం పెరిగిందే తప్ప తగ్గడం లేదని తెలుస్తోంది.
అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో గాని పవన్ కల్యాణ్, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నిమ్మలకు భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పాలకొల్లులో జనసేనకు 32 వేల ఓట్లు వరకు పడ్డాయి...ఆ ఓట్లు నిమ్మలకు కలిస్తే...ఇంకా భారీ మెజారిటీనే వస్తుందని చెప్పొచ్చు. అంటే ఎలా చూసుకున్న పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హవా ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి