కారు పార్టీ, గులాబీ పార్టీ..రెండు పేర్లు కూడా టీఆర్ఎస్ పార్టీవే..ఆ పార్టీ గుర్తు కారు..అలాగే ఆ పార్టీ జెండా కలర్ గులాబీ రంగు. అందుకే టీఆర్ఎస్‌ని కారు పార్టీ లేదా గులాబీ పార్టీ అంటారనే సంగతి తెలిసిందే...మరి అదేంటి కారుకు గులాబీ ముళ్ళు అని అనుకోవచ్చు..అవును దీనికి కూడా ఒక అర్ధం ఉందని చెప్పొచ్చు. కారుకు గులాబీ ముళ్లే పంక్చర్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే సొంత పార్టీ నేతలే..టీఆర్ఎస్‌కు డ్యామేజ్ చేస్తున్నారనే కోణమే ఈ ‘కారుకు గులాబీ ముళ్ళు’.

సరే సొంత పార్టీకి డ్యామేజ్ చేసే నేతలు ఎవరు...అసలు వారి రాజకీయం ఏంటి అనే అంశాలని ఒకసారి చూస్తే..సాధారణంగా అధికార పార్టీ అన్నాక నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటుందనే సంగతి తెలిసిందే..అధికారం చెలాయించాలని ఎవరికి వారు ప్రయత్నించే క్రమంలో ఈ ఆధిపత్య పోరు వస్తుంది..ఈ ఆధిపత్య పోరు తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ఉంది. టీఆర్ఎస్ నేతల మధ్య చాలా రచ్చే నడుస్తోంది.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ అనేక నియోజకవర్గాల్లో ఉంది. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులకు పెద్దగా పడటం లేదు..హర్షవర్ధన్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో కొల్లాపూర్‌లో రచ్చ నడుస్తోంది..పైగా వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. అటు తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల మధ్య రచ్చ నడుస్తోంది..రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి రోహిత్, పట్నంల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి...పైగా వచ్చే ఎన్నికల్లో సీటు నాదంటే...నాది అని గొడవపడుతున్నారు...ఇలా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పలు చోట్ల ఇదే రచ్చ ఉంది. ఈ రచ్చలో ఒకరికి సీటు దక్కితే మరొకరి సహకరించే పరిస్తితి ఉండదు..అప్పుడు టీఆర్ఎస్‌కే డ్యామేజ్ జరుగుతుంది..కాబట్టి ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: