మద్యం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం అందరికీ తెలుసు.. మందు తాగితే ఆయుష్షు తగ్గిపోతుందని ఇక త్వరగా ప్రాణాలు కోల్పోతాము అన్న విషయం కూడా తెలుసు. కానీ నేటి రోజుల్లో మాత్రం మద్యానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పుడు మద్యం తాగే అలవాటు ఉన్నవారిని కాస్త విచిత్రంగా చూసేవారు. కానీ నేటి రోజులలో మాత్రం మధ్యానికి దూరంగా ఉన్న వారిని చిత్రవిచిత్రంగా చూస్తూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎంతో మంది మద్యానికి బానిసగా మారిపోతున్నారూ.


 కొంతమంది కేవలం  అప్పుడప్పుడు మాత్రమే మద్యం తీసుకుంటూ ఉంటే మరికొంతమంది మాత్రం మద్యం అనేది రోజువారీ అలవాట్లలో ఒక భాగంగా మార్చుకుంటున్న వారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తోన్న నివేదికలు చెబుతున్నాయి నిజాలు చూసిన తర్వాత దేశంలో ప్రజలు మధ్యానికి ఇంతలా బానిసలుగా మారిపోయారా అని అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఒక నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 160 మిలియన్ల మంది మద్యం సేవిస్తున్నారట. ఇందులో 95 శాతం మంది పురుషులు. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఎక్కువగా ఉన్నారట. ప్రతి సంవత్సరం బిలియన్ల లీటర్ల మధ్యాన్ని కూడా దేశంలో వినియోగిస్తున్నారట.


 2020 సంవత్సరంలో దేశంలో విక్రయించిన మొత్తం మధ్యంలో 45 శాతం  కేవలం ఐదు రాష్ట్రాల లోనే వినియోగించారు అన్న విషయం ఇటీవల నివేదికలో వెల్లడించింది. ఇక ఇలా నివేదిక చెబుతున్న నిజాల ప్రకారం అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ మొదటి స్థానంలో ఉంది. దాదాపు మూడు కోట్ల మంది జనాభా ఛత్తీస్ఘడ్లో 35.6 శాతం మంది మద్యం సేవించే అలవాటు కలిగి ఉన్నారట.త్రిపుర 2వ స్థానంలో ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ 34.7 శాతం మంది మద్యం సేవిస్తారట. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్. దాదాపు 34.5 శాతం మంది నిత్యం మద్యం సేవిస్తున్నారట. ఈ జాబితాలో నాలుగో స్థానంలో పంజాబ్ 5వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: