అదేంటి ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది రష్యా కదా, మరి అమెరికాకి నిద్రపట్టకపోవడం ఏంటని అనుకుంటున్నారా..? ఉక్రెయిన్ కి మిత్రపక్షంగానే అమెరికా ఉంది కదా మరి ఈ స్టేట్ మెంట్ ఏంటని అనుకుంటున్నారా.. వాస్తవానికి ఉక్రెయిన్ కి రష్యా చేసిన, చేస్తున్న చేటు కంటే అమెరికాయే ఎక్కువ నష్టం కలిగించే పనులు చేస్తోంది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ ని యుద్ధానికి ఎగదోసిన అమెరికా మెల్లగా పక్కకు తప్పుకుందని, పెద్ద దేశం అండ ఉందని రెచ్చిపోయిన ఉక్రెయిన్ చివరకు నష్టపోతోందని అంటున్నారు విశ్లేషకులు.

అమెరికా తలచుకుంటే నాటో సభ్యదేశాల్లో ఉక్రెయిన్ కి సభ్యత్వం ఈపాటికే వచ్చి ఉండేది. అదే జరిగితే ఉక్రెయిన్ తరపున నాటో దళాలు కూడా రంగంలోకి దిగేవి. కానీ అది జరగలేదు, అక్కడే అమెరికా చేసిన మోసం బయటపడింది. పోనీ యుద్ధం మొదలైన తర్వాత అయినా ఉక్రెయిన్ తరపున అమెరికా నిలబడి ఉంటే, రష్యా వెనక్కి తగ్గి ఉండేది. అంటే యుద్ధం లేకుండానే సమస్య పరిష్కారమయ్యేది. కానీ అదీ జరగలేదు.  అంటే అక్కడ కూడా అమెరికా మోసం  బయటపడింది.

ఇప్పుడు అమెరికా సరికొత్త వ్యూహం ఉక్రెయిన్ కి మరింత నష్టం చేకూర్చేలా ఉంది. ప్రస్తుతం యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ కి చెందిన వందలాదిమంది పౌరులు మరణించారు, మరికొందరికి గాయాలయ్యాయి. ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఉక్రెయిన్ సైన్యానికి కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. ఈ దశలో ఉక్రెయిన్ మేలు కోరుకునేవారెవరైనా ఏం చేస్తారు. మధ్యే మార్గంగా చర్చలను ప్రోత్సహిస్తారు. కానీ అమెరికా చేస్తున్నదేంటి. చర్చలను ప్రోత్సహించకుండా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతోంది. ఉక్రెయిన్ కి తనతోపాటు, మరికొన్ని దేశాలు ఆయుధ సామగ్రిని అందించేందుకు సిద్ధం చేస్తోంది. అదే జరిగితే మరింత విధ్వంసం తప్పదు. కేవలం ఇతర దేశాలు మందుగుండు సామగ్రిని మాత్రమే పంపిస్తానంటున్నాయి. అంటే వాటికి కేవలం ఆర్థిక వనరులు మాత్రమే తగ్గుతాయి. కానీ ఉక్రెయిన్ కి ప్రాణ నష్టం అదనం. ఇప్పటికే సైన్యం ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఇతర దేశాలు సమకూర్చే మందుగుండుతో మరిన్ని ప్రాణాలు  పోవాలా..? ఉక్రెయిన్ నాశనాన్నే అమెరికా కోరుకుంటుందా..? చర్చలతో సమస్య సామరస్యంగా పరిష్కారం కావడం అమెరికాకు ఇష్టం లేదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: