ప్రస్తుతానికి యుద్ధం కొనసాగుతోంది, ఇప్పుడు తెలుస్తున్న ఒక వార్త భారతీయుల్ని అత్యంత బాధకు గురి చేస్తుంది అని చెప్పాలి. ఉక్రెయిన్ లో ఒక నగరం అయిన ఖర్కీవ్ లో ఈ రోజు ఉదయం జరిగిన దాడిలో భారతదేశానికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వార్త ఇండియాను కలవరానికి గురి చేస్తోంది. అయితే ఇవాళ ఉదయం నుండి ఖర్ఖీవ్ లో మిస్సైల్ దాడులు జరుగుతుండగా, ఆ ప్రాంతంలోనే చాలా మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని క్షణ క్షణం భయంతో గడుపుతున్నారు. కానీ వారిలో నుండి కర్ణాటకకు చెందిన నవీన్ అనే మెడికల్ విద్యార్థి ఆకలికి తట్టుకోలేక బయట జరుగుతున్న పరిస్థితిని అంచనా వేయలేక బయటకు వెళ్ళాడు.
అయితే అదే సమయంలో గవర్నర్ హౌస్ పై మిస్సైల్ దాడి చేసింది రష్యా. దీనితో ఆ దాడిలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇంకా అదే ప్రాంతంలో ఉన్న 4000 మంది విద్యార్థుల సంగతి ఏమిటని అందరూ భయపడుతున్నారు. ఈ విజయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి అరిందం బాఘ్చి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కనీసం మిగిలిన వారిని అయినా సురక్షితంగా వేరే ప్రాంతాలకు పంపాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి