ఏపిలో ప్రజల సంగతి అటుంచితే ప్రత్యర్ధి పార్టీలు మాత్రం అధికార పార్టీ పై కత్తులు నూరుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా అది, ఇది అని లేకుండా అన్నిటినీ హైలెట్ చేస్తూ ఆరోపణలు చేస్తూ వైసిపి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక ప్రజల విషయానికొస్తే పోలీసుల హడావుడి మాత్రం నిజంగానే కొంచెం ఎక్కువ కనిపిస్తోంది అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కానీ...అక్రమాలు, దోపిడీలు అన్న ప్రస్తావన రావడం లేదు. మార్పు రావాలి, వీలైనంత త్వరగా మంచి జరగాలి అనుకున్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు, వాటిని మన మంచికే అనుకోవాలి తప్ప ప్రశ్నిస్తూ కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అన్నట్లుగా అధికార పార్టీకి మద్దతు బాగానే పలుకుతున్నారు .

కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ప్రత్యర్ధి పార్టీల తోనే ఏ కార్యక్రమం తలపెట్టిన అందులో నెగిటివ్ పాయింట్స్ ని వెతికి... లేకున్నా సృష్టించి విమర్శలు వెదజల్లుతున్నారు అంటూ వాపోతున్నారు వైసిపి నేతలు. అయితే తాజాగా మరోసారి ప్రత్యర్ధి పార్టీ కౌంటర్ల పై ఎటాక్ చేస్తూ దీటుగా స్పందిస్తున్నారు వైసిపి నాయకులు. జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అధికార పార్టీ పై ఘాటు ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని...అరాచకాలు, విధ్వంసాలతో రాష్ట్రాన్ని 25 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేకుండా చేశారని.. పన్నుల రూపంలో లో ప్రజలను సతమతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

అంతేకాదు వైకాపా నేతలు ఎంత గింజుకున్నా విరిగిన ప్రజల మనసును మళ్ళీ గెలవలేరని 2024 లో మళ్ళీ వైసిపి పార్టీ అధికారం లోకి రాదని ద్వజమెత్తారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్న వైసిపి నేతలు తమదైన శైలిలో దీటుగా స్పందిస్తున్నారు. సార్ కాస్త కలల నుండి మేలుకోండి, వాస్తవం లోకి రండి. మీ కలలో మీరే హీరో కాదనను కానీ కాస్త నిజాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి అంటున్నారు. ప్రజలు ఏమి అమాయకులు కాదు వారికి జరుగుతున్న మంచి, కనపడుతున్న అభివృద్ధిని గిట్టని వారు కాదు అంటే మద్దతు పలకడానికి అంటున్నారు. అధికారంలోకి రావాలని ప్రజలకు ఇంకా మంచి చేయాలని ఉంటే మీ పార్టీ ఏమి చేయాలనుకుంటున్న సవినయంగా వివరించండి కానీ... స్వలాభం కోసం వైసిపి పార్టీ పై బురదజల్లే ప్రయత్నం చేయకండి. అది ఎంత వరకు కరెక్టు అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: