వెయ్యేళ్ల తర్వాత ఇలాంటి ఘటన మళ్ళీ ఆకాశంలో ఆవిష్కృతమైంది. గతం లో ఇదే విధంగా క్రీ. శ. 1947లో చివరి సారిగా ఇటువంటి అద్భుతమైన గ్రహాలు కూర్పు జరిగిందని భువనేశ్వర్ లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ పేర్కొన్నారు. కొన్ని సైంటిఫిక్ కారణాల వలన ఇవి ఒకే వరుస లోకి వచ్చి చేరుతాయని వారు చెబుతున్నారు. అయితే ఇలా ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు రావడాన్ని ప్లానెట్ పెరేడ్ అని పిలుస్తారని ఆయన వెల్లడించారు. నిజానికి ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం లేదని ఆయన తెలిపారు. అయితే సౌర వ్యవస్థ యొక్క గ్రహాలు వరుసగా ఒకే లైన్ లో ఉన్నప్పుడు జరిగే సంఘటనను సూచించుటకు ఖగోళ శాస్త్రంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని పట్నాయక్ తెలిపారు.
ఈ అరుదైన సంఘటన అంతరిక్షంలో అందంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సౌర వ్యవస్థ లోని మొత్తం ఎనిమిది గ్రహాలు చాలా అరుదుగా ఒకే వరుస లోకి వస్తాయని, ఇలాంటి ఘటనలు దాదాపు 170 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లానెట్ పెరేడ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి