ఈ కాలంలో పిల్లలు చాలా నీచంగా చెడిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లు వినియోగం వలన పిల్లలు ఇంస్టాగ్రామ్ రీల్స్ కి ఇంకా యూ ట్యూబ్ వీడియోలకు బానిసలుగా మారి చెత్త సినిమాలు చూసి చదువుకోవాల్సిన టైములో చదువుకోకుండా వివిధ చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. పిల్లలే కాదు అన్నీ తెలిసిన పెద్దలు టీచర్లు కూడా గాడి తప్పుతున్నారు.ఇక భావితరం భవిష్యత్ కు బాటలు వేసే దేవాలయం పాఠశాల. పిల్లలు విద్యాబుద్దులు నేర్చుకునేందుకు రోజు స్కూల్ కు వెళతారు.అటువంటి పవిత్ర దేవాలయాలు పని తీరు అయితే రోజురోజుకీ మారిపోతుందని గత కొంతకాలంగా పలువురు విద్యావేత్తలు సాంఘిక సంఘ సంస్కర్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి కూడా తెలిసిందే.ఇక ఇప్పటికే పలు స్కూల్స్ లో టీచర్స్ తాగి వచ్చి తందానాలు కూడా ఆడుతున్నారు.. ఇక స్టూడెంట్స్ చదువు కోవడానికి స్కూళ్లకు వెళ్లి అడ్డమైన పనులు చేస్తున్నారు. క్లాస్ రూమ్ లోనే ఎన్నో నీచపు పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. క్లాస్‌లోనే తోటి విద్యార్థినులతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఇక ఈ ఘటన అస్సాంలో వెలుగులోనికి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


సిల్చార్ లోని రామానుజ్ గుప్తా కాలేజీలో అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు క్లాస్ లోనే రొమాన్స్ చేసుకుంటున్న వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది.ఇందులో అయితే స్పష్టంగా ఒకరిని మరొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. కాలేజ్ లో లంచ్ విరామం సమయంలో విద్యార్థులు ఈ ఛండాలపు పనులకు పాల్పడినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారంగా మారింది. నీచపు పనులకు పాల్పడిన వారిలో నలుగురు అమ్మాయిలు ఇంకా అలాగే ముగ్గురు అబ్బాయిలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కళాశాల కూడా సీరియస్ అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటిసులు కూడా జారీ చేసింది. ఇక ఆ ఏడుగురు స్టూడెంట్స్ ను సస్పెండ్ చేసింది. వారి తల్లి దండ్రుల పరువుకి భంగం కలగకుండా వీడియో, ఇతర వివరాలు వెల్లడించలేదు. ఇది కేవలం భవిష్యత్తులో అలా తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇంకా స్కూల్, కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం ఇంకా ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: