ఈ విషయమే జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రెండు ప్రధాన పార్టీల అధినేతలు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంటే పవన్ మాత్రం అదేమి పట్టనట్లు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల సమీక్షకు శ్రీకారం చుట్టారు. కుప్పం, రాజాం నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాల పర్యటనకు కూడా రెగ్యులర్ గా వెళుతున్నారు.





సంక్షేమపథకాలకు విడుదలచేసి నిధులను కూడా జనాలమధ్యలోనే చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఎలాగూ జిల్లాలు పర్యటిస్తున్నారు కాబట్టి బహిరంగసభలు కూడా నిర్వహించేస్తున్నారు. ఇంతకుముందునుండే గడపగడపకు వైసీపీ కార్యక్రమంతో మంత్రులు, ఎంఎల్ఏలను జనాల్లో ఉండేట్లుగా ప్లాన్ చేశారు. అంటే ఏదోరకంగా తనతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు జనాలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నారు.





ఇదే సమయంలో చంద్రబాబు కూడా కొద్దిరోజులు బాదుడేబాడుడనే కార్యక్రమం పెట్టుకున్నారు. తర్వాత నియోజకవర్గాల సమీక్ష కూడా చేశారు. తాజాగా ఓ నాలుగు నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరిపారు. ఎలాగూ జూమ్ మీటింగులు జరుగుతునేఉన్నాయి. అంటే జనాల్లోకి రెగ్యులర్ గా వెళ్ళకపోయినా కనీసం నియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షలు చేస్తు పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు. మరిదే సమయంలో పవన్ ఏమిచేస్తున్నట్లు ? జిల్లాల పర్యటనలూ లేక నేతలతోను రెగ్యులర్ గా టచ్ లో ఉండక ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలీదు.





పార్టీకి ఇప్పటివరకు పటిష్టమైన యంత్రాంగంలేదు. పార్టీలో తాను, నాదెండ్ల మనోహర్ తర్వాత చెప్పుకోదగ్గ మూడో నేత ఎవరులేరు. అలాంటపుడు ఎవరితో సమీక్షలు నిర్వహించాలో పవన్ కు అర్ధమవుతున్నట్లు లేదు. వైసీపీ, టీడీపీల్లో సిట్టింగుల్లో చాలామందికి టికెట్ల గ్యారెంటీఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులుగా చెప్పుకునేందుకు గట్టి నేతలున్నారు. మరి జనసేనలో అదికూడా లేదు. కనీసం ఖాళీసమయాల్లో అభ్యర్ధుల వడపోతైనా జరిగితే కాలం కలిసొస్తుంది. మరీ పార్టీలో ఎలాంటి యాక్టివిటి లేకుండా కేవలం జగన్ను టార్గెట్ చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే జనాలు వాళ్ళే ఓట్లసేస్తారని పవన్ అనుకుంటున్నారో ఏమో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: