ఏపీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కన్నీటిని తుడుస్తున్నాడు.. ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.. వాటి ద్వారా చాలా మంది లబ్ది పొందుతున్నారు. ఇది ఇలా వుండగా ఇప్పుడు జగన్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నాడు.సీఎం జగన్ నెల రోజుల కిందట కోనసీమ లో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించిన సీఎం జగన్ దృష్టి లో పడ్డారు.


చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ను సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతిపాదనల ను వెంటనే పంపాలని ఆదేశించారు. కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనల ను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరు చేసింది. హనీ వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరుచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్‌ వెల్లడించారు.. గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని, ప్రస్తుతం 13 ఇంజక్షన్ల ను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.


ఈ ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా, కంపెనీ సంప్రదింపులు జరిపి వీటిని తెప్పించారు. ప్రతి 15 రోజుల కు ఒక ఇంజక్షన్‌ ను క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు. అలాగే పాప భవిష్యత్తు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముఖ్యమంత్రి స్పందించి ఉదారంగా సహకారం అందించారని కలెక్టర్‌ తెలిపారు. పింఛన్ ఇప్పించేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన తెలిపారు.. చిన్నారి తల్లి దండ్రులు మాట్లాడుతూ.. మా చిన్నారి ప్రాణాలను కాపాడిన సీఎం జగన్ కు కృతజ్ఞతలను తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి: