పేద ప్రజల కోసం మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది..ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వ జన్ ధన్ యోజనను 2014లో తీసుకొచ్చారు.అనేక మంది గ్రామీణులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ కింద సుమారు 47 కోట్ల మంది ఖాతాలను తెరిచారు. అలా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూ.1.30 లక్షలు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ కింద అకౌంట్ హోల్డర్లకు రెండు రకాల ఇన్సూరెన్స్ సదుపాయాలను కల్పిస్తోంది. ఇందులో ఒకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కాగా మరొకటి సాధారణ బీమా. యాక్సిడెంటల్ కవర్ కింద రూ. లక్ష ప్రయోజనం ఇస్తుండగా.. సాధారణ కవర్ కింద రూ.30 వేలను ప్రభుత్వం అందిస్తోంది.


ఈ క్రమంలో ఖాతాదారుడికి ప్రమాదం జరిగితే 30,000 రూపాయలు ఇస్తారు. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు అందజేస్తారు.ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ముకు వడ్డీ లభిస్తుంది. పైగా ఈ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం చాలా మంది మెచ్చిన అంశం. అలాగే ఖాతాదారులకు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పైగా ఈ ఖాతాతో పాటు ఇచ్చే రూపే డెబిట్ కార్డులకు చాలా షాపింగ్ సైట్లలో మంచి డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జీరో బ్యాలెన్స్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు...


భారత పౌరులు ఎవరైనా ఈ అకౌంట్ ను తెరవవచ్చు. ఖాతా తెరవడానికి కనీసం 10 ఏళ్ల వయస్సు ఉండాలి. బ్యాంక్ మిత్ర ద్వారా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. 18-65 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రూపే కార్డు హోల్డర్లకు అదనంగా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా అందుబాటులో ఉంది. దీనిని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. బ్యాంకుల్లో మీకు ఏదైనా ఇతర పొదుపు ఖాతా ఉంటే.. దానిని జన్ ధన్ ఖాతాగా కూడా మార్చుకోవచ్చు. దీని కోసం చిన్న దరఖాస్తు చేసుకొవాల్సి వస్తుంది..అకౌంట్ ఓపెన్ చేయటానికి KYCకి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, NREGA జాబ్ కార్డ్ లాంటి పత్రాలు అవసరం. ఈ అకౌంట్ కు ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఖాతా ఓపెన్ చేసి 6 నెలలు పూర్తైనప్పుడు మాత్రమే ఓడీ సౌకర్యం అందించబడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: