తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే వైసీపీ నేతల ర్యాంగింగును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తట్టుకోలేకపోయినట్లు అర్ధమవుతోంది. చాలాకాలంగా పవన్ను ఉద్దేశించి వైసీపీ నేతలు దత్తపుత్రుడని, ప్యాకేజీస్టార్ అని పదే పదే మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలను ఏదన్నా విమర్శించాలన్నా, ఆరోపణలు చేయాలన్నా తనకు ఇబ్బంది ఎదురవుతుందని అనుకున్నపుడల్లా వెంటనే పవన్ రంగంలోకి దిగేస్తున్నారు.





తాజాగా వైజాగ్ లో జరిగిన ప్రజాగర్జన కార్యక్రమం విజయవంతమైంది. అధికార వికేంద్రీకరణ, మూడురాజదానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో వైసీపీ మార్గదర్శకంలో జరిగిన భారీ ర్యాలీ, బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రజాగర్జన సక్సెస్ ను దారిమళ్ళించేందుకన్నట్లుగా వెంటనే పవన్ రంగంలోకి దిగేశారు. డైరెక్టుగా చంద్రబాబు రంగంలోకి దిగితే టీడీపీకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.






అందుకనే పెద్ద వ్యూహం పన్నినట్లుగా చంద్రబాబు తెరవెనుకుండి ముందుకు పవన్ను నెట్టారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కూడా ముందు వెనకా ఆలోచించకుండా వైజాగ్ చేరుకున్నారు. ఆ సందర్భంగానే జనసైనికులు మంత్రుల కార్లపై దాడులు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అంటే ప్రజాగర్జన సక్సెస్ తాలూకు చర్చలు మీడియాలో ఎక్కడా జరగకుండా పవన్ను వ్యూహాత్మకంగా చంద్రబాబే ప్రయోగించారన్నది మంత్రుల ఆరోపణ. దాంతోనే మంత్రులు పవన్ను ప్యాకేజీస్టార్, దత్తపుత్రుడంటు పదేపదే ర్యాంగింగ్ చేశారు. దీన్నే పవన్ తట్టుకోలేకపోయారు.






బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న కారణంగానే తాను ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతున్నట్లు పవన్లో బలమైన ఫీలింగ్ ఉన్నట్లుంది. అందుకనే తానొక నిర్ణయం తీసేసుకున్నట్లు ప్రకటించారు. ఆ ఫీలింగ్ ఇపుడు మంత్రులు, నేతలను పవన్ అమ్మనాబూతులు తిట్టిన రూపంలో బయటపడింది. పవన్లో ఎంతటి ఫ్రస్ట్రేషన్ లేకపోతే చెప్పుచూపించి మరీ వార్నింగులిస్తారు ? జరుగుతున్నది చూస్తుంటే తొందరలోనే బీజేపీతో పవన్ కటీఫ్ చెప్పేయటం ఖాయమని అర్ధమైపోయింది. ఈ నేపధ్యంలోనే  చంద్రబాబు-పవన్ మధ్య భేటీజరిగింది. దీనికి పరామర్శ అనే ముసుగు కప్పారు. పొత్తు అని డైరెక్టుగా చెప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఐక్యపోరాటాలనే ముసుగేశారు.   మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: