డబ్బులు పోకుండా సేవ్ చెయ్యాలని అనుకోనేవారికీ పోస్టాఫీసులోని పొదుపు పథకాలు బెస్ట్ అని చెప్పాలి..అనేక పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తున్నాయి. కొన్ని పథకాల వడ్డీపై ఆదాయ పన్ను వర్తిస్తుంది. పోస్ట్ ఆఫీసు పథకాలలో కొన్ని 'EEE' కేటగిరీ కిందకు వస్తాయి. అంటే.. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీపై పన్ను మినహాయింపులు ఉంటాయి. అనేక పోస్టాఫీసు పథకాలపై TDS విధించరు. కాబట్టి, పెట్టుబడిదారులు తరచుగా వీటిని పన్ను రహిత పథకాలుగా భావిస్తారు. అయితే, పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్‌ చేస్తున్నప్పుడు 'ఇతర వనరుల ద్వారా పొందిన ఆదాయం' అనే భాగం కింద ఇటువంటి పథకాలపై సంపాదించిన వడ్డీను ప్రకటించాలి. కాబట్టి పోస్టాఫీసు అందించే వివిధ పథకాలు, వాటికి పన్ను విధించే విధానం గురించి తెలుసుకుందాం..పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌..ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపు, రాబడిపై పన్ను రహిత ప్రయోజనాలు ఉన్నాయి. ఇది EEE కేటగిరీ కిందకు వస్తుంది. మదుపుదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతా తెరిచి, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు PPFలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం పెట్టుబడి మొత్తంపై మినహాయింపులను క్లెయిమ్‌ చేయొచ్చు. PPFపై వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను మినహాయింపు..


సుకన్య సమృద్ధి యోజన..ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరిచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. పెట్టుబడి మొత్తంపై సెక్షన్ 80C మినహాయింపులను క్లెయిమ్‌ చేయొచ్చు. PPF లాగా SSY కూడా EEE కేటగిరీ కిందకు వస్తుంది.పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్లు..పెట్టుబడిదారులు 5 సంవత్సరాల పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్లపై సెక్షన్ 80C ప్రకారం రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనాలను పొందుతారు. తక్కువ వ్యవధి డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు ఉండవు. ఈ డిపాజిట్లపై వడ్డీ పన్ను రహితం కాదు. అయితే, సీనియర్‌ సిటిజన్‌ పెట్టుబడిదారులు సెక్షన్‌ 80TTB కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల వరకు సంపాదించిన వడ్డీపై మినహాయింపులను పొందొచ్చు. 60 ఏళ్ల లోపు వయసున్న డిపాజిటర్లు ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేల కంటే ఎక్కువ వడ్డీ సంపాదించినా.. సీనియర్‌ సిటిజన్లు రూ. 50 వేల కంటే ఎక్కువ సంపాదించినా ఫారమ్‌ 15జీ/15హెచ్‌ సమర్పించకపోయినట్లయితే టీడీస్ వర్తిస్తుంది.


పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ..ఈ ఖాతా డిపాజిట్లపై ఎలాంటి పన్ను ప్రయోజనం అందుబాటులో లేదు. సంపాదించిన వడ్డీ పన్ను రహితం కాదు. పన్ను మినహాయింపులు పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి.


సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌..ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80C కింద రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందుతారు. ఈ పథకంపై పొందే వడ్డీ పన్ను రహితం కానప్పటికీ, పెట్టుబడిదారులు సెక్షన్‌ 80TTB కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వడ్డీపై రూ. 50 వేల వరకు మినహాయింపును పొందొచ్చు. రూ. 50 వేల కంటే ఎక్కువ వడ్డీ సంపాదించిన వారు ఫారం 15H సమర్పించకపోతే TDS వర్తిస్తుంది.కిసాన్‌ వికాస్‌ పత్ర..ఇందులో పెట్టుబడి పెట్టినవారు పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలను పొందలేరు. సంపాదించిన వడ్డీ పన్ను రహితం కాదు. KVPపై TDS వర్తించదు. ఇందులో పన్ను నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌..ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో 80C కింద రూ.1.50 లక్షల పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. అయితే NSCపై ఆర్జించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. NSCకి TDS వర్తించదు. పెట్టుబడి వ్యవధిలో ఆదాయ పన్ను రిటర్న్‌(ITR) దాఖలు చేసేటప్పుడు ఆర్జించిన వడ్డీని పెట్టుబడిదారులు వార్షిక ప్రాతిపదికన ప్రకటించాలి.నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌..NPS సర్వీస్‌ ప్రొవైడర్లకు పోస్టాఫీసు POP (పాయింట్‌ ఆఫ్‌ ప్రజన్స్‌)గా పని చేస్తుంది. కాబట్టి NPSలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఖాతాను తెరవడానికి పోస్టాఫీసు శాఖను సందర్శించవచ్చు. NPS టైర్‌-1 ఖాతాలో స్వచ్ఛంద పెట్టుబడుల కోసం పెట్టుబడిదారులు 80CCD (1B) ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 వరకు తగ్గింపులను క్లెయిమ్‌ చేయొచ్చు. NPS రిటైర్మెంట్‌ కార్పస్‌ మొత్తం పన్ను రహితం.పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా..వడ్డీపై ఆదాయ పన్ను ఉంటుంది. అయితే, డిపాజిటర్ల ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(15)(I) ప్రకారం ఒకే ఖాతాలో రూ. 3,500 వరకు, ఉమ్మడి ఖాతాలో రూ. 7,000 వరకు పొందే వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులు సెక్షన్  ప్రకారం రూ. 10,000 వరకు మినహాయింపు పొందొచ్చు. సీనియర్‌ సిటిజన్లకు సెక్షన్ కింద రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై టీడీస్ వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లో వడ్డీ ప్రకటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: