ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవహారం చాలా విచిత్రంగా తయారైంది. ప్రభుత్వం ఏమిచేసినా ఏడుస్తున్నారు, ఏమీ చేయకపోయినా ఏడుస్తున్నారు. ఇదెలాగుందంటే ఏమీ చేయకపోయినా తప్పే ఏమైనా చేసినా తప్పే అన్నట్లుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీచర్లను బోధనేతర వ్యవహారాలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. మామూలుగా అయితే టీచర్ల సేవలను ఎన్నికల నిర్వహణలోను, జనాభా లెక్కలపుడు, కొన్నిసార్లు పిల్లలకు టీకాలు వేయించేపనిలో కూడా ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.





ఇలాంటి విషయాల్లో తమను ఉపయోగించుకోవటాన్ని టీచర్లు ఎప్పటినుండో వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల విధులనుండి తమను తప్పించమని టీచర్లసంఘాలు కోరుతున్నాయి. సరే కారణాలు ఏవైనా ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ గోలను వినిపించుకున్నది. అందుకనే బోధనేతర వ్యవహారాలకు టీచర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలను జారీచేసింది. వెంటనే టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. అయితే చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం నానా గోలచేస్తున్నారు.





దురాలోచనతోనే టీచర్లను జగన్ ప్రభుత్వం ఎన్నికల బాధ్యతలనుండి తప్పించినట్లు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంపైన టీచర్లకు బాగా మంటగా ఉందన్న విషయం జగన్ కు తెలిసిందట. రేపటి ఎన్నికల్లో తమకు టీచర్లు ఎక్కడ వ్యతిరేకంగా చేస్తారో అన్న భయంతోనే ముందుజాగ్రత్తగా టీచర్లను ఎన్నికలకు దూరంగా ఉంచారనేది చంద్రబాబు ఏడుపు. జగన్ భయంవల్లో లేకపోతే టీచర్ల డిమాండ్ల కారణంగానో టీచర్లను ఎన్నికల బాధ్యతలనుండి తప్పించటం మంచిదేకదా.





బోధనేతర బాధ్యతలను తమకు అప్పగించవద్దని టీచర్లు చాలా సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నది నిజమే కదా. టీచర్ల కోరికప్రకారమే ఎన్నికలకు దూరంగా ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో చంద్రబాబు గోలచేయటానికి ఏముంది ? జగన్ మీద బురదచల్లాల్సిన అవసరమే లేదు. అయినా ఎందుకింత గోలచేస్తున్నారో  అర్ధంకావటంలేదు. ఇందుకనే జగన్ ప్రభుత్వం ఏమిచేసినా ఏడుపే ఏమీచేయకపోయినా ఏడుపే అన్నట్లుగా తయారైంది చంద్రబాబు వ్యవహారం అని జనాలు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు ఎప్పుడు బుద్ధివస్తుందో అర్ధంకావటంలేదు. నిజంగానే ప్రభుత్వంలో తప్పుంటే వదిలిపెట్టాల్సిన అవసరంలేదు. అలాకాకుండా ఊరికే ఏడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: