ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇవాల్టిరోజున రాజకీయాలు మొత్తం కులాలు, మతాల చుట్టూనే తిరుగుతున్నాయి. మతాల వారీగా, కులాలవారీగా జనాలను పార్టీలు విడగొట్టేసి ఏవేవో హామీలను గుప్పించేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నింటిని నెరవేరుస్తాయి మరికొన్నింటిని గాలికొదిలేస్తాయి. కుల, మతాల ఆధారంగా వేసుకునే లెక్కలనే ఇపుడు ముద్దుగా సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే మహానాడు సందర్భంగా చంద్రబాబునాయుడు డిసైడ్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ చాలా పూర్ గా ఉంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో బీసీలు, ఎస్సీల్లో మాదిగలకు పెద్దపీట వేయాలని చంద్రబాబు అధ్యక్షతన మహానాడు డిసైడ్ చేసింది. ఎస్సీల్లోని మాలలు ఎక్కడ వ్యతిరేకం అవుతారో అన్న భయంతో అవకాశం ఉన్న చోట్ల మాలలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేసింది. బీసీలు, ఎస్సీల్లో మాదిగలకు పెద్ద పీట వేయాలని తీర్మానించారు బాగానే ఉంది మరి ఎస్టీలు, కాపులు, క్రిస్తియన్, ముస్లిం మైనారిటిలను ఎందుకు వదిలేశారు.

ముస్లింలకు తమ హయాంలోనే బ్రహ్మాండమైన పథకాలు అమలు చేసినట్లు చంద్రబాబు, లోకేష్ పదేపదే చెప్పుకుంటున్నారు కదా. అలాగే కాపులంతా టీడీపీ వైపే ఉన్నారని చంద్రబాబు, కాపు తమ్ముళ్ళు ఒకటే ఊదరగొడుతున్నారు కదా. మరి కాపులను ఎందుకు పక్కనపెట్టేశారు. అసలు బీసీలు, ఎస్సీల్లోని మాదిగలు టీడీపీతోనే ఉన్నారా ? అన్నది పెద్ద ప్రశ్న. 2014 వరకు బీసీలు టీడీపీతో ఉన్నారు కానీ తర్వాత పరిణామాల్లో దూరమైపోయారు.


వాస్తవంగా చెప్పాలంటే కమ్మ సామాజికవర్గంతో పాటు జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని ఇతర సామాజికవర్గాల్లోని వాళ్ళు మాత్రమే టీడీపీకి మద్దతుగా  ఉన్నారంతే .  29 ఎస్సీ సీట్లలో వైసీపీ తరపున 27 మంది గెలిచారు. ఏడు ఎస్టీ సీట్లలోనూ వైసీపీ ఎంఎల్ఏలే ఉన్నారు. 31 మంది కాపు ఎంఎల్ఏల్లో 27 మంది వైసీపీలోనే ఉన్నారు.  బీసీల్లో మెజారిటి సెక్షన్ మద్దతుగా నిలిచారు కాబట్టే వైసీపీకి అంతటి అఖండమైన మెజారిటి దక్కింది. కాబట్టి మహానాడు సందర్భంగా కేవలం రెండు సామాజికవర్గాలను హైలైట్ చేయటంతోనే చంద్రబాబు సోషల్ ఇంజనీరింగులో ఎంత పూర్ గా ఉన్నారో అర్ధమవుతోంది.మరింత సమాచారం తెలుసుకోండి: