సుప్రింకోర్టులో వైఎస్ సునీతకు పెద్ద నిరశ తప్పలేదు. ఎలాగైనా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తుబెయిల్ ను రద్దుచేయించాలన్నది సునీత పట్టుదల. అయితే అందుకు కోర్టులు సహకరించటంలేదు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ ను అరెస్టుచేసేందుకు సీబీఐ శతవిధాల ప్రయత్నాలు చేసింది. అయితే తెలంగాణా హైకోర్టు ఎంపీకి ముందస్తు బెయిల్ ఇవ్వటంతో అరెస్టు సాధ్యంకాలేదు. దాంతో సీబీఐ మౌనంగా ఉండిపోయింది.





అయితే సునీత మాత్రం ఊరికే కూర్చోకుండా వెంటన సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ మీద అంత అర్జంటుగా విచారణ చేయాల్సిన అవసరంలేదని చెప్పి వెకేషన్ బెంచ్ కేసును ఇదివరకు వాయిదావేసింది. అప్పుడు వాయిదాపడిన కేసు సోమవారం విచారణకు వచ్చింది. అయితే విచారణలో సునీతకు డిజప్పాయింట్మెంట్ తప్పలేదు. ఎందుకంటే ముందస్తు బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కేసును సుప్రింకోర్టు జూలై 3వ తేదీకి వాయిదా వేసింది.





మర్డర్ కేసును ఫైనల్ చేయటానికి సీబీఐకి సుప్రింకోర్టు ఇచ్చిన గడువు ఈనెల 30వ తేదీ. మరి అవినాష్ ముందస్తు బెయిల్ కేసు జూలై 3వ తేదీన విచారణకు వస్తుంది. అంటే 30వ తేదీన గనుక సీబీఐ చార్జిషీటు దాఖలు చేస్తే ఎంపీ బెయిల్ కు వ్యతిరేకంగా సునీత వేసిన పిటీషన్ కు విలువుండదు. హత్యకేసులో అవినాష్ పాత్రుందని సీబీఐ ఆరోపిస్తున్నదే కానీ ఆధారాలను చూపలేకపోతున్నది. బెయిలిచ్చే ముందు తెలంగాణా హైకోర్టు జడ్జి అడిగిన ప్రశ్నలకే సీబీఐ సమాధానాలు చెప్పలేక చేతులెత్తేసింది.





ఇక క్రాస్ ఎగ్జామినేషన్లో సీబీఐ ఇంకేమి ఆధారాలను చూపగలుగుతుంది. సునీత కూడా ఏదో కక్షకొద్ది అవినాష్ ను వెంటాడుతోంది కానీ ఆధారాలున్నట్లు లేదు. పైగా ఈకేసు క్రాస్ ఎగ్జామినేషన్ మొదలైతే ఇరుక్కునేది సునీత+ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డే అనే ప్రచారం పెరిగిపోతోంది. హత్యకేసులో సునీత దంపతుల పాత్రపైన కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇఫ్పటికైతే సునీతకు పెద్ద డిజప్పాయింట్మెంట్ తప్పలేదు. మరి ఈనెల 30వ తేదీన సుప్రింకోర్టు ఏమి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: