ప్రజలను ఆకట్టకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. తనదైన కార్యక్రమాలతో మంత్రులు, ఎంఎల్ఏలను రెగ్యులర్ గా జనాల్లో తిరిగేట్లు చేయటమే జగన్ ఉద్దేశ్యం.  ప్రజాసమస్యల పరిష్కారంలో వీళ్ళకు తోడు అధికారయంత్రాంగం, వాలంటీర్లు కూడా ఉంటారు కాబట్టి వచ్చిన ఫిర్యాదుల్లో కనీసం కొన్నయినా తీరుతాయన్నది జగన్ అంచనా కావచ్చు. విషయం ఏదైనా ప్రజాప్రతినిధులను నిత్యం జనాల్లో తిరిగేట్లు చేయటమే అసలు లక్ష్యం. జూలై 1వ తేదీ నుండి ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం మొదలవ్వబోతోంది.





కొత్త కార్యక్రమంతో మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ ఉద్యోగులు మొత్తం 7లక్షలమంది జనాల్లోకి వెళ్ళబోతున్నారు. ఈసారి ఎక్కువగా మండలస్ధాయిలోని సమస్యల పరిష్కారంపైనే జగన్ దృష్టిపెట్టారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళపట్టాలు లాంటి సమస్యలనే జనాలు ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటారు. వీటిని అక్కడికక్కడే పరిష్కరించేట్లు చేయటమే జగన్ టార్గెట్. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు అందనివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించబోతున్నారు.





కొత్తగా నమోదయ్యే లబ్దిదారులందరికీ ఆగస్టునెల నుండి పథకాలు వర్తింపచేసేట్లుగా జగన్ ఆదేశించారు. పథకాల్లో చేరబోయే కొత్తలబ్దిదారులు కూడా రాబోయే ఎన్నికల్లో తమకే ఓట్లేస్తారని జగన్ అనుకుంటున్నట్లున్నారు. అంటే రాబోయే ఎన్నికల నాటికి ఇటు లబ్దిదారులను ఆకట్టుకోవటం అటు మంత్రులు, ఎంఎల్ఏలతో జతచేసి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, గృహసారధులను జనాల్లో తిప్పటమే టార్గెట్. దీనివల్ల ఏమవుతుందంటే లబ్దిదారులు ప్రజాప్రతినిధులతో పాటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, గృహసారధులను గుర్తుపెట్టుకుంటారు.





ఇదే సమయంలో హౌస్ టు హౌస్ తిరగటం వల్ల ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నవాళ్ళని వీళ్ళు గుర్తించే అవకాశాలున్నాయి. మొత్తానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేసి జనాల్లో చొచ్చుకుని వెళుతుంటే మరి ప్రతిపక్షాలు ఏమిచేస్తున్నట్లు. ప్రభుత్వంలోని లోటుపాట్లను జనాలకు ఎత్తిచూపించాల్సిన ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలంటే టీడీపీ మాత్రమే. ఎందుకంటే జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు నేతలే లేరంటే ఇక క్యాడర్ ఎక్కడుంటారు ? ఇంక జనాల్లోకి ఏమెళతారు ? తమ్ముళ్ళలో కూడా పొత్తులపై అయోమయం బాగా కనబడుతోంది. అందుకనే వాళ్ళు కూడా జనాలను పట్టించుకోవటంలేదు. మొత్తానికి జగన్ దెబ్బకు ప్రతిపక్షాలు చేతులెత్తేసినట్లే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: