
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అబ్బయ్యచౌదరి కొన్ని అంశాలను లేవనెత్తారు. ఫైబర్ నెట్ కుంభకోణంలో దాదాపు రూ.114 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇది 2015 సెప్టెంబరు నుంచి 2018 వరకు జరిగింది. చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఈ టెండరు కట్టబెట్టారు. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్గా పనిచేసిన వారే టెరా సాఫ్ట్ సంస్థకు డెరెక్టర్గా పనిచేశారు.
అప్పటి వరకు బ్లాక్ లిస్టులో ఉన్న టెరా సాఫ్ట్ కంపెనీ బిడ్డింగ్ ముగిసే ముందు రోజు బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన వ్యక్తులను బదిలీ చేశారు. టెండర్ ముగిశాక మరో వ్యక్తిని టెరా నుంచి తొలగించారు. ఇది పూర్తిగా చంద్రబాబు కనుసైగల్లో జరిగింది. దీనికి కీలక సూత్రధారి చంద్రబాబు, లోకేశ్శ్ లేనని దీనివల్ల రూ.110 కోట్ల నష్టం వాటిల్లిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టెండర్లను పిలవకుండా టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు అనేది ఆరోపణ. టెండరు ఈ సంస్థకే వచ్చేలా నిబంధనలు మార్చారు. దీనిపై టీడీపీ నేతలు స్పందిస్తూ ఈ టెండర్ ఇచ్చే నాటికి ఈ టెరా పై నిషేధం లేదు. ఆ తర్వాత నిషేధం అమల్లోకి వచ్చింది వారు వాదిస్తున్నారు. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంత ప్రభావం దీనిపై ఉండదని టీడీపీ నేతలు భావిస్తున్నారు.