తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుప్రింకోర్టులో వేసిన పిటీషన్ డిస్మిస్ అయిపోయింది. ఇంతకీ రేవంత్ వేసిన పిటీషన్ ఏమిటంటే ఓటుకునోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరధిలోకి రాదని. అయితే పిటీషన్ పై ఎలాంటి విచారణ అవసరంలేదని చెప్పి సుప్రింకోర్టు డిస్మిస్ చేసేసింది. అలాగే ఓటుకునోటు కేసు కచ్చితంగా అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తుందని తేల్చిచెప్పింది. ముందు హైకోర్టే రేవంత్ వేసిన పిటీషన్ను కొట్టేసింది. అందుకనే సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే ఇక్కడా చుక్కెదురైంది.





ఇపుడిదే చంద్రబాబుకు బ్యాడ్ సిగ్నల్ గా కనబడుతోంది. ఎందుకంటే ఈ కేసులో అసలు సూత్రదారు చంద్రబాబునాయుడు కాబట్టే. చంద్రబాబు తరపున నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు రు. 50 లక్షల అడ్వాన్స్ ఇస్తు రెడ్ హ్యాండెడ్ గా  రేవంత్ పట్టుబడ్డాడు. ఇదే కేసు 4వ తేదీన సుప్రింకోర్టులో విచారణకు రాబోతోంది. ఓటుకునోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి లేకపోతే కేసు విచారణను తెలంగాణా ఏసీబీ పరిధిలోనుండి తప్పించి సీబీఐకి ఇవ్వాలని వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటీషన్ వేశారు.





ఈ పిటీషన్ను పరిశీలించిన సుప్రింకోర్టు విచారణకు స్వీకరించి 4వ తేదీన  విచారించబోతున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆళ్ళ వాదనకు సుప్రింకోర్టు గనుక సానుకూలంగా స్పందిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లులేదు. ఎందుకంటే రేవంత్ పిటీషన్ను డిస్మిస్ చేసినపుడు ఇది కచ్చితంగా అవినీతి నిరోధక చట్టం కిందకే వస్తుందని సుప్రింకోర్టు తేల్చిచెప్పింది. కాబట్టి ఆళ్ళ పిటీషన్ కు మద్దతు పెరిగినట్లే అనుకుంటున్నారు. రేవంత్ వాదనతో సుప్రింకోర్టు గనుక ఏకీభవించుంటే చంద్రబాబుకు కూడా పెద్ద రిలీఫ్ దక్కేదే. ఆళ్ళ పిటీషన్ విచారణకు ముందురోజే రేవంత్ పిటీసన్ను సుప్రింకోర్టు డిస్మిస్ చేయటం చంద్రబాబుకు బ్యాడ్ సిగ్నలనే చెప్పాలి.





ఇప్పటికే చంద్రబాబు వాయిస్ ను టెస్ట్ చేసిన ఫోరెన్సిక్ ల్యాటరేటరీ రిపోర్టు, వీడియోలను పరిశీలించిన రిపోర్టు అంతా సుప్రింకోర్టు ముందుంది. ఆళ్ళ వేసిన పిటీషన్ విచారణలో ఇవన్నీ గనుక  జడ్జి ముందు చర్చకు వస్తే చంద్రబాబుకు ఇబ్బందని చెప్పకతప్పదు. చూస్తుంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి టైమ్ బాగా బ్యాడ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. లేకపోతే ఎప్పటెప్పటి కేసులో మెడకు చుట్టుకోవటం ఏమిటి ? 24 రోజులుగా స్కిల్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉండటం ఏమిటి ? 

మరింత సమాచారం తెలుసుకోండి: