తెలుగురాష్ట్రాల్లో రాజకీయం చాలా విచిత్రంగా ఉంటోంది. మూడు పార్టీల వైఖరి కారణంగానే రాజకీయమంతా గజిబిజిగా మారిపోతోంది. ఇంతకీ ఆ మూడుపార్టీలు ఏవంటే వామపక్షాలు, జనసేన. విషయం ఏమిటంటే  ఈ పార్టీల రాజకీయం ఏపీలో ఒక విధంగాను తెలంగాణాలో అందుకు పూర్తి విరుద్ధంగాను ఉండటమే. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత వ్యతిరేకత కనబడుతున్నా తమ పార్టీల కోణంలో మాత్రం నిర్ణయాలను సమర్ధించుకుంటున్నాయి పార్టీలు.





ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన ఎన్డీయేలో భాగస్వామని అందరికీ తెలుసు.  ఏపీలో జనసేన, బీజేపీలు మిత్రపక్షాలని కూడా తెలుసు. కానీ రెండుపార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేసిందిలేదు. ఇదే సమయంలో బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీతో జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. మిత్రపక్షం బీజేపీని వదలకుండానే టీడీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. జరుగుతున్నదాన్ని బీజేపీ సినిమా చూసినట్లు చూస్తోంది.





ఇదే జనసేన తెలంగాణా ఎన్నికల్లో టీడీపీని వదిలేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అనేక లెక్కలను వేసుకున్న తర్వాత చివరకు టీడీపీ ఎన్నికల బరిలోనుండే తప్పుకున్నది. ఇదేసమయంలో తెలంగాణా కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకున్నది.  పొత్తులో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ కొత్తగూడెం అసెంబ్లీ సీటును కేటాయించటంతో పాటు రెండు ఎంఎల్సీ సీట్లను హామీ ఇచ్చింది. అయితే ఏపీకి వచ్చేసరికి సీపీఐ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు రెచ్చిపోతు టీడీపీకి మద్దతుగా నిలుస్తోంది. టీడీపీ నుండి ఎలాంటి సంకేతాలు కనబడకపోయినా పొత్తుకు రెడీ అంటు పదేపదే అర్రులు చాస్తోంది. పొత్తు విషయంలో సీపీఎం ఇంకా ఏమీ మాట్లాడలేదు.





తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్ తో సీపీఎం సీట్ల సర్దుబాటు కాలేదు. అందుకనే 17 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అయినా పొత్తు కుదురుతుందని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశతో ఉన్నారు.  బహుశా శుక్రవారం అంటే నామినేషన్ల దాఖలకు చివరిరోజు 10వ తేదీన ఏ సంగతి తేలుతుందని అనుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న సీపీఐ ఏపీలో ప్రయత్నాలు చేసుకుంటోంది. ఏపీలో టీడీపీని పట్టించుకోని సీపీఎం తెలంగాణాలో కాంగ్రెస్ తో  చర్చలు జరుపుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నజనసేన తెలంగాణాలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఇలాంటి పొత్తులను అనైతికమనాలా లేకపోతే అవకాశవాదమనాలా కూడా తెలీటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: