వేణు స్వామి.. ఈ పేరు గురించి తెలుగు జనాలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే  ఏకంగా సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు వేణు స్వామి. ఇక వేణు స్వామి చెప్పిన ఎన్నో విషయాలు కూడా నిజం కావడంతో ఈయన చెప్పిందల్లా నమ్మడం కూడా మొదలుపెట్టారు జనాలు. కేవలం జనాలు మాత్రమే కాదండోయ్..  సినీ సెలబ్రిటీలు కూడా వేణు స్వామిని నమ్మి ఏకంగా ఆయనతో ప్రత్యేకమైన పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.


 రష్మిక మందన్న, నిధి అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు సైతం ఇక వేణు స్వామితో ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం అటు సోషల్ మీడియాలో సంచలనంగా కూడా మారిపోయింది. అయితే మొన్నటి వరకు సినీ సెలబ్రిటీల జాతకంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పి హాట్ టాపిక్ గా మారిపోయిన వేణు స్వామి.. ఇక ఇటీవల తెలంగాణ ఎలక్షన్స్ గురించి కూడా చెప్పేసాడు. ఏకంగా తెలంగాణ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని అందుకోబోతుందని.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తారని.. ఒకవేళ అలా జరగకపోతే తాను జ్యోతిష్యం ఆపేస్తాను అంటూ చెప్పాడు వేణు స్వామి.


 ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏం జరిగిందో అందరూ చూసే ఉంటారు. టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పటికీ ఊహించని విధంగా ప్రజల తీర్పు ఇచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు కట్టబెట్టారు. దీంతో త్వరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీంతో ఇక టిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన వేణు స్వామి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక చెప్పినట్టుగానే వేణు స్వామి జ్యోతిష్యం ఆపేయాలని అప్పుడైనా  సోషల్ మీడియాలో ఈ రచ్చ తగ్గుతుంది అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: