2019 ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరి ప్రస్తుతం 2024 ఎన్నికల కోసం అటు టిడిపి , బిజెపి మధ్య పొత్తుకుదిర్చే బాధ్యత తన భుజాన మీద వేసుకొని ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన ను టిడిపి టీముగా మార్చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. పార్టీ పెట్టి ఇప్పటికి పదేళ్లు అవుతున్న ఎన్నికల కోసం సొంతంగా ఎలాంటి రోడ్డు మ్యాప్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్.. టిడిపి చూపించిన దారిలోనే నడవడమే జనసైనికుల వంతు అంటూ తమకంటూ ఎలాంటి సొంత జెండా లేకుండా పోయింది అంటూ పలువురు కార్యకర్తలు తెలుపుతున్నారు.
స్కిల్స్ కామ్ లో చంద్రబాబును అరెస్టు చేయగా ఏపీలో ఏర్పడ్డ పొలిటికల్ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయిన పవన్ కళ్యాణ్.. స్వయంగా టిడిపి తో పొత్తు ప్రకటించి మరి మరొకసారి జనసైనికులను నిరాశపరిచారు.. అయితే రాకరాక వచ్చిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకున్నారు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు తెలపకుండా ఉంటే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లి ఉంటే 2024లో ఏదైనా జరిగి ఉండవచ్చు.. కానీ అలా చేయకపోవడంతో ఇప్పుడు జగన్ కింగ్ మేకర్ గా మారారు. ప్రస్తుతం చంద్రబాబుకు అండ అనే భ్రమలో పవన్ కళ్యాణ్ తన ఉనికిని కోల్పోతున్నారని వార్తలు జనసైనికుల నుంచి వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి