తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక్కసారిగా ఇరువురు పార్టీల మధ్య కొద్దిగా పాటి చిచ్చురేపిందని చెప్పవచ్చు.. అటు జనసైనికులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కేబుల్ 24 సీట్లు ఇవ్వడంతో చాలామంది సీనియర్ నేతలు కూడా ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి సమయంలో అటు రెండు పార్టీల మధ్య ఒక వార్ మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.. చాలామంది సీనియర్ నేతలు కార్యకర్తలు ఇతరత్న నేతలు కూడా రాజీనామాల వైపుగా అడుగులు వేస్తున్నారు.


కనీసం జనసేనకు 40 స్థానాలను ఇస్తారనుకుంటే ఆశించిన తరుణంలో లేకుండానే 24 సీట్లతో సర్దేయడంతో ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. మరొకవైపు టిడిపి ప్రకటించిన జాబితాలో చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ అచ్చమ్మ నాయుడు వంటి పేర్లు కూడా వినిపిస్తూ ఉంటే జనసేన జాబితాలో కనీసం తమ అధినేత పవన్ కళ్యాణ్ పేరు కూడా లేకపోవడంతో చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు.. పవన్ కళ్యాణ్ పేరు లేకుండా నాదేండ్ల మనోహర్ పేరు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ బిజెపి కూటమిలో వస్తే మిగిలిన 57 స్థానాలలో కొన్ని సీట్లను మాత్రమే కేటాయించాల్సి ఉంటుందట. అయితే టిడిపి సీనియర్లు కూడా వ్యతిరేకంగా ఉండడంతో ఇది చాలా తలనొప్పిగా మారుతోంది.


ఇప్పటికే చాలామంది జనసేన కేడర్ కార్యకర్తలు కూడా రాజీనామా చేస్తున్నారు అన్నిటికీ మించి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేసిక సైతం టికెట్ ఇవ్వకుండా ఉండడంతో మరింత వ్యతిరేకత మొదలవుతోంది. కేవలం 24 స్థానాలలో తమకు నచ్చిన వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకోవాలని తాపత్ర పడుతున్నారు పవన్ కళ్యాణ్.. దీంతో కాపు నియోజకవర్గ నేతలు కూడా ప్రజలు కూడా తమకు నచ్చిన పార్టీకే ఓటు వేయాలని నిర్ణయాన్ని తీసుకోవచ్చని విషయం కూడా ఎక్కువగా వినిపిస్తోంది.. మరి ఇలాంటి సమయాలలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: