ఇక మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడే ఈ ఏ. హరికృష్ణ .. 2019లో టిడిపి తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఎన్నిక లలో ఓటమి పాలయ్యారు..ఇప్పుడు ఆయన జగన్ సమక్షంలో టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరినట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఈసారి ఈ కారణం వల్లే టికెట్ దక్కలేదు. అందుకే మనస్తాపం చెందిన ఆయన వైసీపీలోకి చేరడంతో ఆయనను వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
నేతలు ఒకరి తర్వాత ఒకరు ఇలా టిడిపిని వదిలి వైసీపీలోకి చేరుతున్నారు దీనికి కారణం పొత్తు అని చెప్పవచ్చు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలు మూడో కలసి పొత్తు పెట్టుకున్నా ఈ నేపథ్యంలోనే ఆశలు పెట్టుకున్న నేతలకు టికెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే మనస్థాపం చెందిన చాలామంది సీనియర్ నేతలు ఇలా టిడిపిని వదిలి వైసిపి లోకి చేరడం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ బదిలీలను చంద్రబాబు ఎంతవరకు ఆపుతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి