ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. మే 13 న రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీనితో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరు కొనసాగిస్తున్నాయి..ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. అందులోను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది..కావలి నియోజకవర్గంలో 2014,2019 ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఘన విజయం సాధించింది..దీనిని బట్టి చూస్తే కావలి నియోజకవర్గంలో టీడీపీ కంటే వైసీపీ ఎంతో బలంగా ఉందని అర్ధమవుతుంది. దీనితో ఈ సారి ఎలాగైన కావలిలో పట్టు సాధించి విజయబావుటా ఎగురవేయాలని టీడీపీ భావిస్తుంది..ఇటు వైసీపీ పార్టీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తుంది..దీంతో కావలి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. 

గత రెండు సార్లుగా కావలి ఎమ్మెల్యే గా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే 2009 లో టీడీపీ తరుపున కావలిలో గెలిచిన బీద మస్తాన్ రావు కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీలో వున్నారు..ఈ సారి కూడా వైసీపీ పార్టీ కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తమ అభ్యర్థి గా కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండుసార్లుగా కావలిలో గెలుస్తూ వచ్చిన ఆయననే ముచ్చటగా మూడోసారి పోటీలో నిలిపింది.. ఇటు ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీ కావలి బరిలోకి కొత్త అభ్యర్థిని నిలిపింది.సాధారణ కాలేజీ లెక్ఛరర్ నుండి మైనింగ్ వ్యాపారిగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డికి కావలి టిడిపి టికెట్ దక్కింది. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న మోసాలు దారుణాలు ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి ఈ సారి కావలి నియోజకవర్గంలో టీడీపి జెండా ఎగురావేయాలని బలంగా ప్రచారం చేస్తున్నారు..మరోవైపు అధికార వైసీపీ పార్టీ కావలిలో  మరోసారి గెలిచి తమ పట్టు నిలుపుకోవాలి అని ప్రయత్నిస్తుంది. మరి ఈ సారి కావలి నియోజకవర్గంలో జెండా పాతేది ఎవరో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: