ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. మే 13 న రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ మరియు లోక్‌సభ  ఎన్నికలు ఒకేసారి జరుగనున్నాయి...దీనితో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్దానికి సిద్ధం అయ్యాయి.అధికార ప్రతి పక్ష పార్టీలు నిత్యం ప్రజలలో మమేకం అవుతూ వరుస హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పడు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తూ వస్తున్నాయి..అభ్యర్థుల జాబితా మొదలుకుని వారి ప్రచార కార్యక్రమాలు, ప్రజలలో వారికి లభిస్తున్న ఆదరణ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా సర్వే సంస్థలు తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

అయితే ఇప్పటి వరకు పలు సర్వే సంస్థలు ఇచ్చిన సర్వే ఫలితాలలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మరోసారి అధికారం దక్కనున్నట్లు తెల్చేసాయి.పలు జాతీయ స్థాయి సర్వేలు కూడా ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్‌మత్, పొలిటికల్ క్రిటిక్, లోక్‌పోల్ మరియు ఆత్మసాక్షి సంస్థలు తన సర్వే వివరాలను వెల్లడించాయి.ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది.ఈ సర్వే కోసం ఒక్కో నియోజకవర్గంలో 600 మంది చొప్పున 157 స్థానాల్లో 1,05,000 మంది అభిప్రాయాలను వారు సేకరించారు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగింది. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు.

నాగన్న సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 103 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగిస్తుందని తేలింది.. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమికి 39 స్థానాలు మాత్రమే దక్కుతాయని మిగిలిన మరో 33 సీట్లల్లో వైఎస్ఆర్సీపీ- కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇందులో కూడా 20 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపి దక్కుతాయని నాగన్న సర్వే తేల్చింది.ఇక లోక్‌సభ నియోజకవర్గాల విషయానికి వస్తే 20 నుంచి 21 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని నాగన్న సర్వే తేల్చింది.ఉమ్మడి కూటమి 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే తేల్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: