ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ నేతలు ఓ రేంజ్ లో కీలకమైన ప్రకటనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టో ప్రకటించక ముందే పలు రకాల అంశాలను కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ హామీలతో జనాలలో దూసుకుపోయేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బహిరంగ సభలలో కూడా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులను వివరిస్తూ ఉన్నారు.ఈ రోజున విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం లో జరిగినటువంటి ప్రజా గళం సభలో పలు రకాల అంశాలను కూడా తెలియజేశారు.


ముఖ్యంగా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 25 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని అలాగే మెగా డీఎస్సీ విడుదల ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని.. ప్రతి ఏడాది కూడా అన్నదాత పథకం కింద రైతులకు 25 వేల రూపాయలు ఇస్తామంటూ తెలియజేయడమే కాకుండా వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామంటూ పలు రకాల ప్రకటనలు అయితే చంద్రబాబు చేశారు.  అయితే ఉత్తరాంధ్రలో తమని 35 సీట్లతో గెలిపించాలంటూ కోరారు చంద్రబాబు.



టిడిపి సభలకు సైతం ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారని.. జగన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా అబద్దాలని జగన్ అబద్ధాలు చెప్పడంలో ఒక పీహెచ్డీ చేశారంటూ కూడా ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఏపీ ప్రభుత్వం చాలా బ్రస్టు పట్టి పోయిందంటూ ఎద్దేవ చేశారు. వైసీపీ పాలన ఒక విధ్వంస పాలన అని వైసిపి పాలనలో ఉత్తరాంధ్రలో ఎక్కువగా కబ్జాలు జరిగాయి అంటూ తెలియజేశారు.. విశాఖపట్నం ని డ్రగ్స్ గంజాయిగా మార్చేశారని చంద్రబాబు జగన్ పైన ఫైర్ అయ్యారు.. వైసీపీ పార్టీకి విశాఖ మీద ఉండేది ప్రేమ కాదని కేవలం ఇక్కడ ఉండే సంపాదన మీదే ప్రేమ అంటూ చంద్రబాబు మాట్లాడారు.. ఉత్తరాంధ్ర పై విజయసాయి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.దీంతో టీడీపీ నేతలు రైతులకు, పెన్షన్ దారులకు  తీయటి కబురు చెప్పారని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: