ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిళ... కడప ఎంపీగా పోటీ చేస్తున్నప్పటినుంచీ డోసు మరీ పెంచేస్తూ విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో కడపలో ఉన్నన్ని రోజులూ వివేకానంద రెడ్డి హత్య కేసు పేరు చెప్పి అవినాష్ రెడ్డిని, జగన్ మోహన్ రెడ్డిని బాగా విమర్శిస్తూ.. తనకే ఓటు వేయాలని కొంగుచాటి మరీ అడిగారు షర్మిళ. ఈ సమయంలో తాజాగా తిరుపతి, పుత్తురుల్లో కూడా షర్మిళ పర్యటించారు.ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిళ. ఆమె చేసిన విమర్శలో భాగంగా... నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్‌ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారని మొదలుపెట్టిన షర్మిళ... ఆ లిస్ట్ చదివి వినిపించడం జరిగింది. వారిలో ఒకరు రోజా కాగా... మిగిలిన ముగ్గురూ... ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు అని షర్మిళ అన్నారు.


వీరంతా కూడా కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారంటూ షర్మిళ తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఆదివారం నాడు రాత్రి పుత్తూరు కాపు వీధిలో ఏపీ న్యాయ యాత్ర సందర్భంగా మైకందుకున్న పీసీసీ చీఫ్ వై ఎస్ షర్మిళ... ఎమ్మెల్యే రోజమ్మ ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గం కోసం పనిచేయలేదని తీవ్రంగా విమర్శించారు. అయినా కానీ నేడు మళ్లీ ఓట్లు అడుగుతుందని.. ఇసుక, మట్టి నుంచి దోచుకున్న డబ్బులే నియోజకవర్గంలో ఓట్లకోసం అందరికీ పంచిపెడుతుందని షర్మిళ ఫైరయ్యారు.ఆ తరువాత తన అన్న జగన్ మోహన్ రెడ్డి పైన కూడా విమర్శలు గుప్పించారు షర్మిళ. ఇందులో భాగంగా... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగనన్న ఈ జిల్లాకు ఇచ్చిన హామీలు మరిచిపోయారని.. వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు గాలేరు పనులు 90 శాతం పూర్తిచేస్తే, జగనన్న మిగిలిన పదిశాతం పనులు కూడా చేయలేదని షర్మిళ దుయ్యపట్టారు. చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని గొప్పలు చెప్పి ఏ హామీని నెరవేర్చలేదని వై ఎస్ షర్మిళ విమర్శించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: