ఉత్తరాంధ్ర జిల్లా అయిన విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019 వ సంవత్సరంలో ఇక్కడ వైసీపీ 11, టీడీపీ 4 సీట్లు గెలిచాయి. అంటే వైసీపీ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఇక 2024 వ సంవత్సరంలో ఈ జిల్లా ఓటర్లు టీడీపీ 9, వైసీపీ 2, జనసేన 3, బీజేపీకి 1 సీటు గెలిపించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన నియోజకవర్గాల వారీగా లెక్కల వివరాలు గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ, విశాఖ నార్త్ లో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, విశాఖ వెస్ట్- టీడీపీ అభ్యర్థి గణబాబు, గాజువాక-టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అలాగే చోడవరంలో టీడీపీ అభ్యర్థి K.S.N రాజు, మాడుగుల-టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి, అరకు-వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం..పాడేరు-టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, పెందుర్తి-జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, యలమంచిలి-జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, పాయకరావుపేట-టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఇంకా నర్సీపట్నం-టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం స్పష్టత వచ్చింది.


ఇక అనకాపల్లి విషయానికి వస్తే..జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం బాగా వర్క్ అవుట్ అయ్యింది. పైగా అతనికి అనకాపల్లి ప్రజలకు సన్నిహితుడుగా పేరుంది. గవర సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం ప్లస్ అవుతోంది. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్‌కు రాజకీయ అనుభవం సరిగ్గా లేకపోవడం కూడా కొణతాలకు కలిసొచ్చే అంశమే. మొత్తానికి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం తెలుస్తుంది.విశాఖ సౌత్‌లో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌ గెలుచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 


ఇక భీమిలి విషయానికి వస్తే.. భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: