ఆంధ్రప్రదేశ్ లో నేడు జోరుగా పోలింగ్ జరుగుతుంది.పక్క రాష్ట్రాలలో వున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇప్పటికే తమ ఓటు హక్కును వినయోగించుకుంటున్నారు. పలు సమస్యాత్మక నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన నియోజకవర్గాలలో పోలింగ్ జోరు కొనసాగుతుంది..అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓ నియోజకవర్గంపై ఏపీ ప్రజలు పూర్తి దృష్టి పెట్టారు..ఆ నియోజకవర్గమే మంగళగిరి..టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయడం ఇది రెండో సారి. గత ఎన్నికల్లో పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు.అయితే ఈ సారి ఎన్నికలలో ఎలాగైన గెలిచి తీరాలనే కసితో ఉన్నారు.అయితే గత నాలుగేళ్లుగా నియోజకవర్గ ప్రజలతో అందుబాటులో వున్నా కూడా పేద ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదని స్థానిక ప్రజలు, వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రత్యేకంగా మంగళగిరికి ఆయన 20 హామీలు గుప్పించారు.తాను ఎమ్మెల్యే అయ్యాక.. ఇవి కచ్చితంగా నెరవేరుస్తానంటూ అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసారు..

సెక్టార్ల వారీగా నియోజకవర్గాన్ని విభజించి ప్రచారాన్ని తీవ్ర తరం చేశారు.ఓటు కోసం భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. బూటకపు హామీలు ఇచ్చి ఈ సారి ఎలక్షన్ లో ఎలాగైన గెలవాలని చూస్తున్న లోకేష్ కు మంగళగిరి ప్రజలు తమ ఓటుతో బుద్దిచెప్పేందుకు మరోసారి పోలింగ్ కేంద్రాలకు దూసుకొస్తున్నారు. ఈసారి పోలింగ్ గతంలో కంటే మరింత పెరిగే అవకాశం ఉంది.. అయితే ఈ సారి కూడా మంగళగిరిలో లోకేష్ ఓడితే ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సారి మంగళగిరిలో నారా లోకేష్ కోసం ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా.. ప్రచారంలో ముందుకు సాగారు. గతంలో మాదిరిగా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కాకుండా.. ఈ సారి 20 రోజుల ముందే వచ్చి ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసారు.. మరి ఈ సారి ప్రజలు లోకేష్ కు మద్దతు ఇస్తారో లేదో చూడాలి…

మరింత సమాచారం తెలుసుకోండి: