ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు , మూడు నెలల నుండి ఎన్నికల హీట్ నెలకొని ఉంది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం మేము అధికారం లోకి వస్తాము అంటే మేము అధికారం లోకి వస్తాము అని ప్రధాన పార్టీలు చెబుతూ వస్తున్నాయి.

ఇక కాసేపు ఈ విషయాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు. మొత్తంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఇలా అనేక విషయాలపై బెట్టింగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా ఈ సారి పిఠాపురం నియోజక వర్గం నుండి పోటీ లోకి దిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 30 వేల మెజారిటీని సాధించబోతున్నాడు అని , వీలైతే అంతకన్నా ఎక్కువ సాధిస్తాడు అని బెట్టింగ్ రాయులు బెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక టీ డీ పీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుండి పోటీ లోకి దిగారు. ఈయనకు కూడా పది వేల మెజారిటీ పక్కాగా వస్తుంది అని అనేక మంది బెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వై సీ పీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పై మాత్రం ఎవరు పెద్దగా బెట్టింగులు వేయడం లేదు అని తెలుస్తుంది. జగన్ ఓడిపోతాడు అని ఎవరూ బెట్టింగులు వేయడం లేదు అని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు పై భారీగా బెట్టింగులు వేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై ఎందుకు వేయడం లేదు అనేది పెద్దగా ఎవరికి అర్థం కావడం లేదు. మరి ఈ సారి ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ సీట్లను సాధించి రాష్ట్రం లో అధికారం లోకి వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: