ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అంతా ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. నరాలు తెగే ఉత్కంఠత.. ఈ సారి ఎవరు గెలుస్తారు.. అధికార పార్టీనా లేక కూటమా..? అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు..ఇప్పటికే తమదంటే తమదే విజయమని ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ధీమా గా వున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో సోషల్ మీడియా  లో ఇప్పటికే పలు సర్వేలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే రాష్ట్రం లో ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఓ న్యూస్  విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ సారి  కూటమికి భారీగా సీట్లు వస్తాయని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరుగుతుంది. దీనితో పందెం రాయుళ్ళు కూటమిపై జోరుగా పందెం కాస్తున్నారు.అయితే తాజాగా ఎన్నికలలో తామే గెలుస్తాం అని అని ఊదరగొడుతున్న టీడీపీ బండారం బయటపడింది.

టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరిట నకిలీ ఎగ్జిట్ పోల్‌ ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందుస్తాన్ టైమ్స్‌కి చెందిన లాజికల్ ఫాక్ట్స్ విభాగం ఈ విషయాన్నీ బయటపెట్టింది.ఈ సారి ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ పేరిట  సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫేక్ సర్వే నిజం కాదని తెలిపింది.2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్‌ను మార్ఫ్ చేసి ఆ స్క్రీన్ స్క్రీన్‌షాట్ ని  టీడీపీ వర్గం బాగా ప్రచారం చేస్తుందని ఆ జాతీయ మీడియా సంచలన విషయం బయట పెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయ్యో పచ్చ పార్టీ పరువుపోయిందిగా అని వైసీపీ ఎద్దేవా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: