సాధారణంగా ఎన్నికల్లో ఒకరి గెలుపును నిర్ణయించేది దేవుడు కాదు ఓటర్లే అని చెప్పవచ్చు. ఓటర్లు సామాన్యుడిని పీఎం చేయగలరు, పీఎంను పూర్తిగా పక్కన కూర్చోబెట్టగలరు. అంత శక్తి ఓటర్ల చేతిలో ఉంది. అయితే ఈ ఓటర్ దేవుళ్ళు లోకేష్‌ను పూర్తిగా ఆశీర్వదించారని ఆ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రమంతటా బలంగా నమ్ముతోంది. ఇంకో విషయం ఏంటంటే లోకేష్ ఓడిపోతాడు అని పెట్టింది కాసే దమ్ము ఎవరికి ఉండడం లేదు. కనీసం ఆయన ఓడిపోతాడు అని ప్రకటన చేసేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయడం లేదు.

అతడు ఈసారి కచ్చితంగా గెలవబోతున్నారని చాలామంది నమ్ముతున్నారు. నిజం చెప్పాలంటే ఆయన భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆ మెజారిటీ ఎంత అనేదానిపై పందేలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కొంతమంది అయితే లోకేష్ ఈసారి 30 వేల మెజారిటీతో విన్ అవుతారని బెట్టింగులు పెడుతున్నారు. 30,000 మెజారిటీ క్రాస్ అవుతుందని 30 శాతం మంది బెట్టింగ్ కడుతుంటే 20,000 మెజారిటీ దాటుతుందని 50 శాతం మంది పందేలు కాస్తున్నారు. పోయినసారి ఇలా లేదు ఈసారి మాత్రమే బలంగా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు దీన్ని బట్టి ఆయన గెలుపు దాదాపు నిజమవుతుందని అని తెలుస్తోంది.

ఆయన గెలుపొందిబోతున్నారని ఊరికే అనడం లేదు ఈసారి లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు వారికి బాగానే డబ్బులు ఇచ్చారు. ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ప్రతి వ్యక్తికి ఆయన దగ్గరయ్యారు. ఆ రేంజ్ లో ఎవరూ కూడా ఓటర్లను కలిసి ఉండరు. ఆయన చేసిన కృషియే విజయానికి కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నారావారి అబ్బాయి మంచి మెజారిటీతో గెలిస్తే వైసీపీ షాక్ అవుతుంది. ఒక సీటు కూడా గెలవలేని పప్పు, అసమర్థుడు అని ఇప్పటిదాకా అతనిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. జూన్ 4 తర్వాత ఆ ఛాన్స్ వైసీపీ నేతలకు ఉండకపోవచ్చు. పట్టుదల సంకల్పంతో లోకేష్ గెలిచి చూపిస్తే అందరి నోళ్ళు మూతపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: