ఇండియా హెరాల్డ్‌.. వెబ్ ప్ర‌పంచంలో అతి త‌క్కువ కాలంలోనే అన‌న్య సామాన్య‌మైన శిఖ‌రాల‌ను అధిరోహించిన సంస్థ‌. 14 ఏళ్ల కిందట చాలా సింపుల్‌గా ఒకే ఒక్క ఆథ‌ర్‌తో ప్రారంభ‌మైన ఈ వెబ్ పోర్ట‌ల్‌కు ఇంతింతై అన్న‌ట్టుగా ఈ రోజు భార‌త‌దేశంలోనే ప‌లు భాష‌ల్లో విస్త‌రించే స్థాయికి ఎదిగింది. పోర్ట‌ల్ ప్రారంభించిన‌ప్పుడే ఈ పోర్ట‌ల్లో వ‌చ్చే సినిమా రివ్యూలు అనేక సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. కృషి ఉంటే.. అన్న‌ట్టు.. త‌న‌ను తానుమ‌లుచుకుని.. తాను వేసుకున్న అభివృద్ధి మెట్ల‌పై వ‌డివ‌డిగా చేసిన ప్ర‌యాణం.. ప్రపంచం స్థాయికి చేరుకునేలా చేసింది. ఈ క్ర‌మంలో సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ఐటీ దిగ్గ‌జం.. స‌రిప‌ల్లి కోటి రెడ్డి.. మార్కు.. మ‌న‌కు అతి అడుగులోనూ.. హెరాల్డ్ న‌డ‌త‌లోనూ స్ప‌ష్టంగా గోచ‌రిస్తుంది.


తొలుత తెలుగు కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన హెరాల్డ్‌.. సినిమా రివ్యూల్లో ఉన్న‌ది ఉన్న‌ట్టు రాస్తూ.. ఆయా సినిమాల‌పై త‌న అభిప్రాయాన్ని కుండ బ‌ద్ద‌లు కొడుతూ.. వీక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను చూర‌గొన‌డ‌మే కాకుండా.. త‌న‌పై వీక్ష‌కుల్లో విశ్వాసాన్ని ప్రోది చేసింది. ఏ పోర్ట‌ల్ ఓపెన్ చేసినా నిజ‌మైన సినిమా స‌మీక్ష భూత‌ద్దంలో పెట్టుకుని వెతికినా క‌న‌ప‌డ‌దు. అనేక వెబ్ పోర్ట‌ల్స్‌, మెయిన్ మీడియా ప్ర‌క‌ట‌న‌లకు బందీగా మారి.. అస‌లు సిస‌లు స‌మీక్ష‌కు బంది అయిపోయాయి. హెరాల్డ్ మాత్రం సినిమా ఎలా ఉందో ఉన్న‌ది ఉన్న‌ట్టు బండ‌కేసి బాదేసేది.


ఫ‌లితంగా 14 ఏళ్ల‌ కిందట ప్రారంభ‌మైన ఏపీ హెరాల్డ్ ప్ర‌యాణం.. అనతి అనేకాలంలోనే అనేక మైలురాళ్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని.. ఇండియా హెరాల్డ్ అనే శిఖ‌ర స‌మాన‌స్థాయికి చేరింది. దీని వెనుక కోటిరెడ్డి క‌ష్టం.. ఆయ‌న వ్యూహం వంటివి క‌నిపిస్తాయి. ప్ర‌స్తుతం ఇండియా హెరాల్డ్‌.. ఒక్క తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, త‌మిళం, కన్న‌డం, హిందీ, బెంగాలీ, మ‌ళ‌యాళం ఇలా.. ప‌లు భాష‌ల్లో నిత్యం కోట్ల మంది పాఠ‌కుల‌కు, వీక్ష‌ల‌కు వార్త‌ల విందు చేస్తోంది. ఎంతో మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. మ‌రెంతో మందికి ప్ర‌త్య‌క్షంగా మార్గ‌ద‌ర్శ‌నం చేస్తోంది.


ప్ర‌స్తుతం ఇండియా హెరాల్డ్ వెబ్‌పోర్ట‌ల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ధీటుగా ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌డంతో పాటు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లోనే వ్యూస్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదంతా కూడా కోటిరెడ్డి వ్యూహాల నుంచి వ‌చ్చిన స‌క్సెస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: