కేంద్రంలో మోడీ ప్రభుత్వం సంకట పరిస్థితిలో ఉందా? ఏక్షణమైన మోడీ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉందని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం మారిందని... చంద్రబాబు లేదా నితీష్ కుమార్ పక్కకు జరిగితే ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.


ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని...  తమ ప్రభుత్వం బలంగా ఉందని అమిత్ షా ప్రకటించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కూడా అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాలే కాదు 2029 లోను మోడీ ప్రభుత్వం... కేంద్రంలో రావడం గ్యారంటీ అని తెలిపారు. దీన్ని ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు పని పాట లేక తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నానని.. మండిపడ్డారు అమిత్ షా.


ఇండియా కూటమికే సరైన నాయకత్వం లేదని విమర్శలు చేశారు. ఒకరి మాట ఒకరు వినరని... అలాంటిది ఇండియా కూటమి అధికారంలోకి వస్తే... వాళ్ల ప్రభుత్వమే క్షణాల్లో కూలిపోతుందని తెలిపారు.  ఇది ఇలా ఉండగా మోడీ సర్కార్ సొంతంగా ఏర్పాటు కాలేదు. తెలుగుదేశం మరియు జేడీయు పార్టీలు కలిసి మరీ... సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2014 మరియు 2019లో సొంతంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది.


కానీ ఈసారి 240 సీట్ల వద్దే బిజెపి ఆగిపోయింది. మొత్తానికి 273 మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే కేంద్రంలో అధికారంలోకి రావడం గ్యారెంటీ. అయితే...  దానికోసం చంద్రబాబు అలాగే జెడియు అధినేత నితీష్ కుమార్ సహాయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ.  ఇక అటు 234 స్థానాల వద్ద ఇండియా కూటమి పార్టీలు ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp