* లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్
* కలకుంట్ల కుటుంబంలో మొదటి అరెస్ట్
* లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
* లిక్కర్ స్కామ్ లో బెయిల్ కోసం కవిత చూపులు
తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు... కల్వకుంట్ల కవితకటకటాల వెనుక ఉన్నారు.కల్వకుంట్ల కుటుంబంలో.. ఇప్పటివరకు ఎవరు కూడా ఏ స్కాం లో ఇరుకలేదు. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం... లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని... గత ఆరు నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో... కల్వకుంట్ల కవిత దోషిగా తేలినట్లు వార్తలు వచ్చాయి..
అయితే కొంతమంది కల్వకుంట్ల కవిత పేరు చెప్పు చెప్పడంతో... ఈడి అధికారులు.. ఆరు నెలల కింద కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. ఇక అప్పటినుంచి ఢిల్లీలోని తీహార్ జైల్లో చిప్పకూడు తింటున్నారు కల్వకుంట్ల కవిత. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు పాలు అయ్యారు. అవినీతిని తరిమికొట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.
ఢిల్లీలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అటు పంజాబ్లో కూడా అధికారాన్ని చేపట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్... ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని అరెస్టు అయ్యారు.ఆయనతోపాటు కల్వకుంట్ల కవిత లాంటి చాలామంది ప్రముఖులు కూడా అరెస్టు రావడం జరిగింది. అయితే ఈ కేసులో జైలు పాలు అయిన కల్వకుంట్ల కవిత చాలాసార్లు బెయిల్ కోసం అప్లై చేశారు.
కానీ కోర్టు ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు.రకరకాల కారణాలు చెప్పి... కల్వకుంట్ల కవిత వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ వస్తోంది కోర్టు. అయితే కల్వకుంట్ల కవిత... అరెస్టు కారణంగా గులాబీ పార్టీకి భారీ ఎదురుదెబ్బే తగులుతుంది.పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కవిత అరెస్టు కావడంతో.. గులాబీ పార్టీ జీరో స్థానాలకు పడిపోయిందని చెప్పవచ్చు. అలాగే.. గులాబీ పార్టీలో ఉన్న చాలామంది లీడర్లు కూడా బయటకు వెళ్తున్నారు. కవిత అరెస్టు ఎఫెక్ట్ కచ్చితంగా గులాబీ పార్టీ మీద ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.