తెలంగాణ రాష్ట్రంలో... ఇప్పుడు అంతా కెసిఆర్ సభ గురించి చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం పాటు ఫామ్ హౌస్ లోనే... ఉన్న కేసీఆర్.. ఇకపై కథనరంగంలోకి దిగబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం పూర్తయిందని... గర్జించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఉద్యమ పార్టీగా వచ్చిన టిఆర్ఎస్ పార్టీ.... ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయింది.

 రజతోత్సవం పేరుతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం రెండు నెలల నుంచి ఏర్పాట్లు జరిగాయి. ప్రత్యేకంగా 13000 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు కేసీఆర్. ఈ సభ కోసం పది లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 3000 ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించబోతున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీసీకి ఎనిమిది కోట్లు ఇచ్చి మరి ఆర్టీసీ బస్సులు తీసుకువస్తున్నారు.

 అంటే ఈ లెక్కన ఓ మండలానికి  రెండు బస్సులు చొప్పున వస్తున్నాయి. అయితే ఈ సభను.. అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. మొదటగా... ఈ సభ జరిగే వరంగల్ జిల్లాలో.. కొత్త సెక్షన్లు అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ల ప్రకారం సభలు అలాగే ర్యాలీలు, మీటింగులు  నిర్వహించకూడదని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  

 దీంతో కోర్టుకు వెళ్లిన కెసిఆర్ పార్టీ నేతలు.. అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై... తెలంగాణ హైకోర్టు కూడా చాలా సీరియస్ గా వ్యవహరించింది. అక్కడితో ఆగకుండా గులాబీ పార్టీ నేతలను.. ఈ సభ కంటే కాంగ్రెస్లో చేర్పించుకోవాలని... రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కానీ కెసిఆర్ అది గమనించి నేతలను అలర్ట్ చేశారు. ఇలా కేసీఆర్ ఒక్క సభ పెట్టగానే.. అడ్డుకునేందుకు... అనేక స్కెచ్ లు వేస్తోంది కాంగ్రెస్. కెసిఆర్ సభ అనగానే.. వెన్నులో వణుకు పుట్టినట్లు వ్యవహరిస్తోంది. అయినప్పటికీ.... కెసిఆర్ తగ్గకుండా ఈ సభను సక్సెస్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: