ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య అనేక దాడులు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొదట పాకిస్థాన్ కి సంబంధించిన కొంత మంది ఉగ్రవాదులు భారతదేశానికి సంబంధించిన కొంత మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. దీనితో భారత ప్రభుత్వం భారతీయ ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వారిలో అనేక మంది ని చంపి వేసింది. దానితో పాకిస్తాన్ ప్రభుత్వం వారు ఉగ్రవాదులు అయి ఉండవచ్చు. కానీ వారిపై దాడి చేసిన నేపథ్యంలో మా దేశానికి సంబంధించిన ఎంతో మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు.

దానితో మేము కూడా భారత్ పై దాడి చేస్తాం అని ప్రకటించింది. చెప్పిన విధంగానే పాకిస్తాన్ కూడా భారత్ పై ఇప్పటికే దాడులను మొదలు పెట్టింది. దానితో ప్రస్తుతం ఓ వైపు భారత్ , మరో వైపు పాకిస్తాన్ రెండు దేశాలు పెద్ద ఎత్తున దాడులు జరుపుకుంటున్నాయి. కానీ పాకిస్తాన్ చేసిన దాడులను భారత సైన్యం చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కానీ భారతదేశం చేసే దాడులను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ చతికల పడిపోతుంది. ఇది ఇలా ఉంటే భారత్ , పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిన అనంతరం ఆ దేశాలలో మగ పిల్లలు ఎక్కువ శాతం జన్మిస్తారు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... గతంలో రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత ఎక్కువ శాతం మగ పిల్లలు మాత్రమే పుట్టారు అని , ఈ ఫైనామినాకు  రిటర్నింగ్ సోల్జర్ ఎఫెక్ట్ అని సైంటిస్టులు పేరు పెట్టారు. కానీ ఎందుకు భారీ యుద్ధాలు జరిగిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మగ పిల్లలు జన్మిస్తున్నారు అనే దానిపై మాత్రం కారణాలను తెలుసుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: