ఈ ఏడాది తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అలా 72 వ మిస్ వరల్డ్ పోటీలలో థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచాత చూవాంగ్ శ్రీ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. అయితే మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో పెట్టినప్పటి నుండి విపక్షాలు కాంగ్రెస్ పై మండిపడుతున్నాయి  ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీలు చేయరాలేదని ఆరోపించాయి. ఇందులో భాగంగా ఈ పోటీలలో వివిధ దేశాల కి సంబంధించిన అమ్మాయిలు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ అయినటువంటి మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. మిస్ వరల్డ్ పోటీలో తనని ఒక వేశ్యలా అందరూ చూశారు అంటూ పోటీలో పాల్గొనకుండానే తన దేశం తిరిగి వెళ్ళిపోయిందట.

అయితే దేశం తిరిగి వెళ్ళిపోయే సమయంలో మీడియాలో మిల్లా మ్యాగి తనని వేశ్యలా చూశారంటూ ఆరోపణలు చేసి వెళ్ళింది.దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయాల్లో సంచలనం సృష్టించడంతో తాజాగా ఈ వ్యవహారం పై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.ఆయన తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఏం జరిగింది అని ఆ సీసీ టీవీ ఫుటేజ్ బయట పెట్టాలని,అసలు మిస్ వరల్డ్ పోటీలను మ్యానేజ్ చేయడం కాంగ్రెస్ తరం కాలేదు అంటూ చెప్పుకోచ్చారు. అంతేకాదు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనకుండానే ఇంగ్లాండ్ కి వెళ్లిపోయిందని,ఆమెను కాంగ్రెస్ లో కీలకంగా ఉండే ఓ ఎంపీ, అలాగే ఓ ఐఏఎస్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఈ ముగ్గురు కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అభ్యంతరంగా ఉన్నారనే విషయం బయటపడింది.

దీన్ని భరించలేకే మిల్లా మ్యాగీ కనీసం అందాల పోటీలలో కూడా పాల్గొనకుండా తన దేశం తిరిగి  వెళ్లిపోయినట్టు సంచలన ఆరోపణలు చేశారు హరీష్ రావు.అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని చాలామందిలో ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఒకవేళ స్పందిస్తే దీని గురించి ఏం మాట్లాడతారు..అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆ ముగ్గురు మిల్లా మ్యాగిని వేధించారని అసభ్యంగా ప్రవర్తించారని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: