భారతదేశం  ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇతర దేశాలను కూడా తలదన్నే విధంగా  ముందుకు వెళ్తోంది. అంతేకాదు  చాలా దేశాలతో మంచి స్నేహభావంతో మెదులుతూ వ్యాపార రంగాల్లో కూడా ముందుకు వెళ్తోంది. ఇది తట్టుకోలేనటువంటి కొన్ని దేశాలు భారత్ పైకక్ష్య తీర్చుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా భారత్ ని  ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య కరోనా వైరస్ లాంటివి సృష్టించి ప్రపంచాన్ని అంతా ఇబ్బందులకు గురిచేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ కు లోలోపల సపోర్ట్ చేస్తూ  ఇండియా పై ఉసిగొలుపుతోంది. అయినా ఇండియా అన్నింటికీ తట్టుకొని నిలబడుతోంది. 

దీన్ని తట్టుకోలేనటువంటి చైనా మరోరకంగా ఇండియాను అభివృద్ధిలో ముందుకు వెళ్లకుండా తన అక్కసును వెళ్లగక్కింది. మరి చైనా ఏం చేస్తోంది అనే వివరాలు చూద్దాం.. ఇప్పటికే భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని తీసుకువచ్చి అదరహో అనిపించింది. ఇదే తరుణంలో బుల్లెట్ ట్రైన్ లకు సంబంధించి  మరికొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టింది. అయితే ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కొన్ని ఇంజన్లను భారత్ ఇతర దేశాల్లో బుక్ చేసింది. మూడు జర్మన్ మేడ్ టన్నెల్  ఓరింగ్ మిషన్స్ ఇక్కడికి రావలసి ఉంది. ఈ ఇంజన్ లను చైనా ఇక్కడికి రాకుండా తన పోర్టులో నిలిపివేసింది. దాదాపు 5 నెలల నుంచి అవి అక్కడే ఉండిపోయాయి.

అయినా ఇది కావాలనే చేస్తూ మన ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అభివృద్ధిలో మనం ముందుకు వెళ్లి ప్రపంచ దేశాల ముందు నిలబడకుండా చేస్తోందని చెప్పవచ్చు. ఐదు నెలల నుంచి ఏదో ఒక సాకు చెప్పి అసలు ఆ ఇంజన్లను ఇక్కడికి రాకుండా నిలిపివేసింది. ఇదే కాకుండా ఎరువుల సరాపరా కూడా చైనా పోర్ట్ నుంచే ఇక్కడికి రావాలి. కానీ వాటిని కూడా ఇక్కడికి రాకుండా ఎన్నో సాకులు చెబుతూ ఆపివేసి దేశంలో ఎరువుల కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా చైనా ఏదో ఒక రకంగా ఇండియాను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పకనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: