
భీంపూర్‌లో జరిగిన మరో ఘటనలో, ఓ బాలికను రాజస్థాన్‌లో రూ.10,000కు విక్రయించినట్లు తేలింది. ఈ విషయం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పెద్దమ్మ కుమారుడు ఓ వేడుక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, రాజస్థాన్‌లో ఉన్న బాలిక దానికి లైక్ చేయడంతో ఆమె ఆచూకీ తెలిసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఈ దందాలో పాల్గొన్న భార్యాభర్తలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కరణ్ అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో మరో బాలికను కూడా విక్రయించినట్లు సమాచారం ఉంది. ఈ ఘటనలు జిల్లాలో మానవ అక్రమ రవాణా ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తున్నాయి. దళారులు నిరుపేద కుటుంబాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఆర్థిక లాభం కోసం బాలికలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ రాకెట్‌లో ఉన్నత కుటుంబాలతో పాటు, కొందరు అధికారుల పాత్ర కూడా సంచలనం రేకెత్తిస్తోంది. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ దందాను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు