ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో ఊహించడం చాలా కష్టంగా మారింది. రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రిగా పేరుపొందిన kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పక్క కాంగ్రెస్ కుటుంబం ఈయన తండ్రి కాలం నుంచే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఉమ్మడి ఏపీకి మూడేళ్ల పాటు సీఎంగా కూడా పనిచేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అయితే పార్టీని వీడిన తర్వాత ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎందుకో ముందుకు రాలేకపోతున్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి పార్టీలో ఉన్నారు.అయితే అక్కడ ఆయనకి పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు.

ఉమ్మడి ఏపీలో 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కి దేశంలోనే సీనియర్ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టిడిపి కూటమి పార్టీ కూడా ఫెయిల్ అయ్యిందని కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకొని మరి పుంజుకోవాలనే చర్చలు కూడా మొదలవుతున్నాయట. కానీ సీనియర్ నేతలు ఎవరూ కూడా షర్మిల వెంట నడవడానికి మక్కువ చూపడం లేదు.

కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎంతో మంది నాయకులు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వారితో షర్మిలకి పెద్దగా పరిచయాలు కనిపిస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. వైసీపీ నుంచి ఒకసారి అధికారంలోకి  వచ్చిన జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా వైసిపి పార్టీ ప్రస్తుతం ఉన్నది. దీంతో అటు కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ ఈ రెండిటిలో తప్ప నాయకులు మరే పార్టీలో చేరడానికి మక్కువ చూపడం లేదు. పొలిటికల్ పరంగా రెడ్డిస్ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు కూడా ఏపీ రాజకీయాలలో టర్నింగ్ పాయింట్ అవుతూ ఉంటుంది. దీంతో మాజీ సీఎం kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిప్పుకునేలా చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపిలో కూడా ఈయనకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: