బిజెపి గత మూడు పర్యాయాల నుంచి భారతదేశాన్ని పాలిస్తోంది.  ఇప్పటికే నరేంద్ర మోడీ మూడుసార్లు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ పాలనలో దేశం గత దశాబ్ద కాలానికి పైగా  అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది. ముఖ్యంగా మోడీ చరిష్మా వల్ల మన దేశానికి విదేశాల్లో కూడా మంచి పేరు వచ్చింది. ఆయన ప్రతి దేశం తిరుగుతూ  మన ఇండియాకి ఉన్నటువంటి బలాన్ని నిరూపిస్తున్నాడు. ఆ విధంగా మోడీ పాలనలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, అలాగే ఉగ్రవాదం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ విధంగా మోడీ ఒక గొప్ప లీడర్ గా భారతదేశంలో విరాజిల్లుతున్నాడు. 

అలాంటి ఈ తరుణంలో  ప్రధాని మోడీ రాజీనామాకు తేదీ ఖరారు అయిందంటూ ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.. సెప్టెంబర్ 17వ తేదీన దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని అంటున్నారు. 2025 సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. అయితే బిజెపి అంతర్గత రాజ్యాంగం ప్రకారం..  75 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే  ఎలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నా సరే దిగిపోవాలి అని.. ఆ విధంగానే 2025 సెప్టెంబర్ 17  వరకు ప్రధాని మోడీకి 75 సంవత్సరాలు నిండుతాయి..

ఇదే తరుణంలో 75ఏళ్ల రిటర్మెంట్ పై  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్  ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఆయన మాట్లాడింది ప్రధాని మోడీ ని ఉద్దేశించే అంటున్నారు చాలామంది సోషల్ మీడియా జనాలు.. మరి చూడాలి సెప్టెంబర్ 17 నాటికి  మోడీ ప్రధాని పదవి నుంచి తొలిగిపోయి ఇంకొకరికి ఛాన్స్ ఇస్తారా లేదంటే  ఆయనే కొనసాగుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.. ఇక మోడీ ప్రధాన మంత్రి పదవి నుండి తప్పుకుంటే ఆయన స్థానంలో కొత్తగా ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉంది అని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: