ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి వరుస పెట్టి వైసిపి నాయకులపై కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు.. వైసిపి ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఇప్పటికే కొడాలి నాని,వల్లభనేని వంశీ వంటి వారిపై కేసులు నమోదు చేసి జైల్లో తోసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని మీడియా టిడిపి పార్టీకి శాపంగా మారుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి కారణం వైసిపి నేతలు మాట్లాడే మాటలను వక్రీకరిస్తూ మీడియా చూపిస్తుంది. కానీ టిడిపికి సపోర్ట్ గా మీడియా మాట్లాడుతూ, పత్రికల్లో కూడా ప్రచురితం కావడంతో మీడియా,పత్రికలు టిడిపి పార్టీకి శాపంగా మారుతున్నాయని అంటున్నారు.

 దానికి కారణం రీసెంట్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,పేర్ని నాని ఈ ఇద్దరు మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించి చూపెట్టింది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ..వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద నేను పెట్టిన కేసు ఇప్పటివరకు నమోదు చేయలేదు. కానీ ప్రశాంతి రెడ్డి పెట్టిన కేసు మాత్రం నా మీద నమోదు చేశారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. నాకు దమ్ము ధైర్యం లేదా.. పదివేల మందిని తీసుకొని ప్రశాంతి రెడ్డి ఇంటి మీద నేను పడలేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను మీడియా,పత్రికలు వక్రీకరిస్తూ పదివేల మందిని తీసుకువెళ్లి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటి మీద పడతారట అంటూ రాశారు.

కానీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంబంధించిన వాళ్ళు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన విషయాన్ని మాత్రం రాయలేదు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని రాశారు. కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భార్య హారికను తిడితే మాత్రం దాని గురించి రాయలేదు. అలాగే హారిక కన్నీళ్లు పెట్టుకుంటే ముసలి కన్నీరు అని వక్రీకరించి రాశారు . ఈ విధంగా పత్రికలే తెలుగుదేశం పార్టీకి దరిద్రంగా, శాపం గా మారాయని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. పత్రికలు వక్రీకరించి రాయడంతో పబ్లిక్ లో అది వేరే విధంగా వెళుతుంది.

అలాగే పేర్ని నాని మాట్లాడిన మాటలు కూడా వక్రీకరించి రాశారు.ఏం చేస్తారో చేయండి. అని పేర్ని నాని మాట్లాడితే దాన్ని వేరే విధంగా రాశారు. అలాగే కొడాలి నాని ఆపరేషన్ కూడా పూర్తయింది.మరో రెండు నెలల్లో బయటికి వస్తారు. మీరు ఏం చేస్తారో మేము చూస్తాం. మేము చేసేది మేం చేస్తాం అంటూ మాట్లాడారు. కానీ పేర్ని నాని మాటలను తప్పుగా చూపిస్తూ వైసిపి నేతల విచ్చలవిడతనం అంటూ రాశారు. ఈ విధంగా టిడిపి పార్టీకి సపోర్ట్ గా ఉంటూ వైసీపీ నాయకుల మాటలను వక్రీకరించి రాయడం టిడిపి పార్టీని మీడియానే ముంచేస్తుందని అనుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: